నిండుకుండలా శ్రీపాద ఎల్లంపల్లి

0 12

పెద్దపల్లి ముచ్చట్లు:

పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి పాజెక్టు నిండు కుండలా మారింది. 35 గేట్లు ఎత్తి 2,50490వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గోదావరి ఎగువన భారీ వర్షాలు కురవటంతో కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు. దీంతో పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాశయంలో నీటిమట్టం భారీగా పెరిగింది. జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి 15,7879 క్యూసెక్కుల నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వస్తోంది. ఈ క్రమంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 35 గేట్లు ఎత్తి 2,50490 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 19.45 టీఎంసీలుగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు ఆనకట్ట, దిగువ గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎవరు నదీ తీరం వద్దకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి గంటకోసారి సైరన్ మోగిస్తూ మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags:Nindukundala Sripada Ellampalli

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page