నిత్యావసర సరుకులు ధరలు తగ్గించాలి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

0 10

విశాఖపట్నం   ముచ్చట్లు:
ఇత్యావసరాల ధరలు తగ్గించాలని టిడిపి జాతీయ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు ఆదేశాలు మేరకు పాడేరు మండలం గుత్తులపుట్టులో   మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అద్వర్యంలో  నిరసన కార్యక్రమం చేపట్టారు.నిరసనను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్రోలు,డీజిల్,వంట గ్యాస్ తో పాటు అన్ని నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్నంటుతుందని దీని వలన సామాన్యుడి బ్రతుకు దయనీయంగా మారిందని అన్నారు.ఏ నిత్యావసర సరుకులు కొనుక్కోవాలన్న ధరలు బగ్గుమనడంతో ఏమిచేయలేని పరిస్థితి లో ప్రజలు ఉన్నారని ఈ కరోన కాలంలో ధరలు తగ్గించాల్సింది పోయి అధికంగా ధరలు పెచడాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ప్రశ్నిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని,మాట తప్పని మడమ తిప్పని పరిపాలన అంటే ఇదేనా అని ప్రభుత్వాన్ని విమర్శించారు.ఈ కార్యక్రమంలో యువ నాయకుడు కోడా వెంకట సురేష్ కుమార్,
మాజీ ఎంపిటిసి సాగేని బొంజుపడాల్,వంఛర్బ మత్యలింగం,కొంతెలి వెంకటప్రసాద్,వంతలపుష్ప,కోటిబాబు,శ్రీను,యశోధమ్మ,
ఆనంతరావు,బాలరాజు,తో పాటు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గున్నారు.

 

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

- Advertisement -

Tags:Commodity prices should be reduced
Former MLA Giddy Ishwari

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page