నెలాఖరులోపు పనులన్నీ పూర్తిచేయాల్సిందే- కాంట్రాక్టర్‌లకు సూచించిన పెద్దిరెడ్డి

0 29

– మండలంలో సుడిగాలి పర్యటన
– అభివృద్దిపనులు త్వరగా పూర్తి చేయాలి

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

గ్రామ సచివాలయ భవనాలు, ఆర్‌బికే, విఎల్‌ఎస్‌, బిఎంసీయూ,సిమెంటురోడ్లు, నాడునేడుపనులన్నీ ఈనెలాఖరు లోపు పూర్తిచేయాల్సిందేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి సూచించారు. గురువారం మండలంలో సుడిగాలి పర్యటన చేసి 15 సచివాలయాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంట్రాక్టర్‌లతో సమావేశం జరిగింది. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలమేరకు మండలానికి మంజూరు చేసిన అభివృధ్ది పనులన్నీ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. పనులు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పూర్తిచేసి ప్రారంభోత్సవాలకు సిద్దం చేయాలని సూచించారు. పనులన్నీ ఏ ఏదశలో ఆగుపోయాయో పరిశీలించి బిల్లులు చెల్లింపు, పనులు ఆపడానికి గల కారణాలను తెలుసుకొని సమీక్షించారు. గ్రామస్థాయి నుంచి ప్రజా ప్రతినిథులు, అధికారులు సమన్వయంతో అభివృద్ది పథంలో నడిపించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్‌ల కు సకాలంలో బిల్లులు చెల్లింపులు జరిగిలా చూడాలని పంచాయతీ రాజ్‌శాఖ అధికారులకు సూచించారు. విధులల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, మండల పార్టీ కన్వీనర్‌ రామమూర్తి, సింగిల్‌విండో చైర్మన్‌ రవిరెడ్డి, బూత్‌ కమిటీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి, సింగిల్‌విండో డైరక్టర్‌ రమేష్‌బాబు,మంత్రి పిఏ చంద్రహాస్‌, పిఆర్‌ డిఈఈ ప్రసాద్‌, ఎంపీడీఓ శంకరయ్య, ఏఈ పురుషోత్తం, సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

Tags: All the work has to be completed by the end of the month – Peddireddy advised the contractors

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page