పార్లమెంట్ లో వైసీపీ గేర్ మార్పు

0 31

విజయవాడ  ముచ్చట్లు:
పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కి గుండెకాయ వంటిది. ఇందులో ఎవరికి ఏ సందేహం లేదు. అలాగే ఈ ప్రాజెక్ట్ ను తన హయాంలో ఎలాంటి సమస్యలు పూర్తి చేయాలిసిన బాధ్యత ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ ఆర్ పార్టీ దే. దీనిని తలపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అయితే పూర్తి చేసింది ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి అన్న ఖ్యాతి రావాలి. ఇది మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ కల కూడా. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ కు అనుమతుల కోసం పదేళ్ళపాటు ఎక్కిన గడప ఎక్కకుండా ఢిల్లీ నుంచి తమిళనాడు వరకు పర్యటించి అందరిని ఒప్పించి కీలకమైన అనుమతులను వైఎస్ ఆదేశాలతో సాధించింది ఉండవల్లి అరుణ కుమార్ కాబట్టి దానిమీద ఆయనకు అంత ప్రేమ. అయితే నిర్వాశితుల అంశంలో జగన్ సర్కార్ దగా చేస్తుందని ఇటీవల మరోసారి గొంతెత్తారు ఉండవల్లి. ఇది చాలా సీరియస్ గా తీసుకొని పక్షంలో అపకీర్తి జగన్ అంటగట్టుకుంటారని ఓపెన్ గానే చెప్పారు మాజీ ఎంపి.ఉండవల్లి అరుణ కుమార్ మీడియా సమావేశం పెట్టి పోలవరంపై తన సలహాలు, సూచనలు, విమర్శలు చేశాకా వైసీపీ లో కదలిక ఏర్పడింది. ముఖ్యమంత్రి జగన్ పోలవరం పర్యటనకు వారం క్రితమే బయల్దేరాలిసిఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన తాజాగా పర్యటించారు. ఇకపై పోలవరం ప్రాజెక్ట్ విషయంలో జగన్ సీరియస్ గానే ముందుకు వెళ్తారన్న సంకేతాలు వైసిపి నుంచి స్పష్టం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధుల కోతతో నిర్వాసితుల వెతలు తీర్చలేని దుస్థితిలో జగన్ సర్కార్ ఉంది.అందుకే పార్లమెంట్ లో సైతం ఆ పార్టీ గతంలో లేని దూకుడు ను ప్రదర్శించింది. పోలవరం పై కేంద్రం చట్టంలో ఉన్నా సవరించిన అంచనాల ప్రకారం నిధులు మంజూరు చేయడంలో కొర్రీలు వేస్తుంది. ప్రాజెక్ట్ అయితే పూర్తి అవుతుంది కానీ ఎప్పటికి ముంపు బాధితుల పునరావాసానికి సొమ్ములు ఇవ్వని పరిస్థితి స్పష్టం అవుతుంది. ఈ నేపథ్యంలోనే విభజన చట్టం అమలుకు పార్లమెంట్ లో ఎందుకు వైసీపీ నిలదీయలేకపోతోంది అని ఉండవల్లి అరుణ కుమార్ చాలాకాలంగా మొత్తుకుంటున్నారు. మొత్తానికి ఇప్పటికి అధికారపార్టీలో కొద్దిగా చలనం బయల్దేరింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమవంతు ప్రయత్నం చేస్తున్నట్లు అయినా ప్రజల్లో కనిపించకపోతే బాగోదని కాకుండా ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఇదే పోరాటం కొనసాగించాల్సిఉంది. లేకపోతే ప్రయోజనం లేదని వైసీపీ సైతం తీవ్రంగా వచ్చే ఎన్నికల్లో నష్టపోతుందన్నది ఉండవల్లి అరుణ కుమార్ లాంటి మేధావుల అంచనా. పార్లమెంట్ వేదికగా ఇకపై వైసీపీ ఈ పోరాటం చేస్తుందో లేదో చూడాలి.

 

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

- Advertisement -

Tags:YCP gear change in Parliament

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page