ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం

0 3

– పోలీస్ యూనిట్ ఆసుపత్రిని ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

- Advertisement -

ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యధికప్రాధాన్యత ఇస్తోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. స్థానికబాలాజీ కాలనీలోని పోలీస్ క్వార్టర్స్ వద్ద గురువారం ఉదయం పూజాధి కార్యక్రమాలు నిర్వహించి,  శిలాఫలకాన్ని ఆవిష్కరించి,  పోలీస్ యూనిట్ హాస్పిటల్ ను ప్రారంభించారు. తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్  పీఎస్ గిరీషా, అర్బన్ ఎస్ పీ వెంకట అప్పల నాయుడుతో కలిసిఈ కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో
భూమన కరుణాకరరెడ్డి మాట్లాడారు. పోలీసు కుటుంబాలతో పాటు, సామాన్యు ప్రజలకు కూడా ప్రాథమిక వైద్య సేవలు అందించేలా, మెరుగైన సౌకర్యాలతో పోలీస్ యూనిట్ హాస్పిటల్ ను ఏర్పాటు చేయడం శుభపరిణామం గా పేర్కొన్నారు. పోలీస్ యూనిట్ ఆసుపత్రి ఏర్పాటు కు కృషిచేసిన  అర్బన్ ఎస్పీ వెంకట్ అప్పల నాయుడును ప్రత్యేకంగా అభినందించారు. పోలీస్ యూనిట్ ఆసుపత్రిని పోలీసు కుటుంబ సభ్యులతో పాటు, స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు మాట్లాడుతూ ఫార్మసీ,ల్యాబ్ టెక్నీషియన్స్, వైద్యుల పర్యవేక్షణలో పోలీస్ యూనిట్ ఆసుపత్రి పనిచేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని పోలీసు కుటుంబ సభ్యులు తో పాటు , స్థానిక సామాన్య ప్రజలు కూడా ప్రాథమిక వైద్యాన్ని పొందవచ్చని తెలిపారు. తిరుపతి నగర కమిషనర్ పీఎస్ గిరీషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి
పెద్దపీట వేస్తోందన్నారు. ఇందులో భాగంగా నగరంలో మరో ఆరు
పీ హెచ్ సీ లను నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ
సుప్రజ పాల్గొన్నారు.

 

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags: Government priority for public health

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page