ప్రజా స్వామ్యాన్ని ఉరితీస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు

0 4

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బండ శంకర్

జగిత్యాల  ముచ్చట్లు:

- Advertisement -

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని,ప్రజల హక్కులను ఉరి తీస్తున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బండ శంకర్ అన్నారు.గురువారం ఏఐసీసీ, టీపీసీసీ  పిలుపు మేరకు చలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్టు చేయడాన్ని బండ శంకర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా బండ శంకర్ మాట్లాడుతూ ఇజ్రాయిల్ దేశం ‘పెగాసన్ స్పైవేర్’ వారి భద్రతా దళాల ఉపయోగం కోసం తయారు చేస్తే దానిని బీజేపీ,తెరాస ప్రభుత్వాలు రాజకీయాలకు,వ్యక్తిగత దాడులకు వినియోగిస్తున్నారని బండ శంకర్ ఆరోపించారు.2017 లో భారత ప్రధాని మోడీ ఇజ్రాయిల్ దేశ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆ దేశంలోని నిఘా సంస్థ అయిన ‘పెగాసన్ స్పైవేర్’ తో ఒప్పందం చేసుకుని,మనదేశంలోని ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ,జర్నలిస్టులు, జడ్జీలు,కార్మిక నేతలు, జేఎన్టీయూ విద్యార్థులు,అంబెడ్కరిస్టులు,చివరికి ఇద్దరు కేంద్ర మంత్రుల,ఇతర మేధావుల ఫోన్లు హ్యాక్ చేశారని బండ శంకర్ అన్నారు.

దేశ ప్రజలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని,కేంద్ర హోంశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని బండ శంకర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగ భూషణం,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య,కౌన్సిలర్ జీవన్, జగిత్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండా మధు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి రాము,అనుమల్ల కిరణ్,కట్ట శివ,గిరిధర్, కిషోర్, శంకర్,అనిల్ శెట్టి,నేహాల్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags:Central and state governments executing public ownership

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page