బర్ద్ లో పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలి : టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి

0 11

తిరుపతి ముచ్చట్లు:

 

 

బర్ద్ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ అంశాలకు సంబంధించి పరిశోధనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.పరిపాలన భవనం లోని తన చాంబర్లో గురువారం ఆయన బర్ద్ ఆసుపత్రి పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, చిన్న పిల్లలకు సంబంధించి పోలియో, బోన్ కరెక్షన్, స్కోలియోసిస్, సెరబ్రిల్ పాలసీ తదితర వాటి కోసం ప్రత్యేకంగా యూనిట్ ఏర్పాటు చేయాలని సూచించారు. కోవిడ్ 19 తగ్గుముఖం పట్టాక ప్రారంభించిన ఓపిలో ట్రామా, సెరిబ్రిల్ కేసులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఆపరేషన్ల వెయిటింగ్ పీరియడ్ మూడు నెలల దాకానే ఇవ్వాలని ఈవో చెప్పారు. ఆసుపత్రి సమగ్ర నిర్వహణ కోసం తయారు చేసిన హాస్పియో రామ సాఫ్ట్ వేర్ ను పూర్తిస్థాయిలో ఉపయోగించాలన్నారు. టీటీడీ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగం పై శిక్షణ ఇవ్వాలని చెప్పారు. పరికరాల కొనుగోలు కామన్ ప్రొక్యూర్ మెంట్ సెల్ ద్వారానే జరగాలన్నారు. వివిధ పరికరాల కొనుగోలు కోసం పిలిచిన టెండర్లు పై సమీక్షించారు. బర్ద్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 150 బెడ్లను అవసరమైతే 350 దాకా పెంచేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సివిల్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అంతకు ముందు ఆయన బర్ద్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మిస్తున్న చిన్న పిల్లల ఆసుపత్రి పై అధికారులతో సమీక్షించారు.అదనపు ఈవో, బర్ద్ ఎండి   ధర్మారెడ్డి, ఎఫ్ఏ అండ్ సిఎవో   బాలాజి, ఐటి ఇంచార్జ్   శేషారెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళీధర్, ఆర్ఎమ్ఓ   శేష శైలేంద్ర , ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

Tags: Priority should be given to research in Bird: TTD Evo Dr KS Jawahar Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page