బిఎంఎస్ ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం

0 8

పెద్దపల్లి  ముచ్చట్లు: 

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని బిఎంఎస్ (ఎస్సికెఎంఎస్) కార్యాలయంలో గురువారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. శుక్రవారం ఉదయం జీడికే 11 ఇంక్లైన్  లో గేట్ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జెబిసిసిఐ ముఖ్య సభ్యులు కోల్ సెక్టార్ ఇంచార్జ్ లక్ష్మారెడ్డి, నరేందర్ కుమార్ సింగ్ ఏబికెఎంఎస్ అధ్యక్షులు, కోల్ సెక్టార్ సేఫ్టీ కమిటీ సభ్యులు సుధీర్ గురుడే ఏబికేఎంఎస్ జనరల్ సెక్రెటరీ, జెబిసిసిఐ సభ్యులు వీరితో పాటు ఏబికేఎంఎస్ కార్యదర్శులు, ఎస్సికెఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి మాధవ నాయక్, వై.సారంగపాణి తదితరులు పాల్గొంటారని తెలిపారు. జెబిసిసిఐలో జరుగుతున్న విషయాలు సింగరేణిలో జరుగుతున్న విషయాలు జరుగుతున్న పరిణామాలను నాయకులు తెలియజేస్తారని, కావున అధిక సంఖ్యలో బిఎంఎస్ కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, సింగరేణి కార్మికులు పాల్గొనాలని కోరారు. రీజియన్ అధ్యక్షులు వంగల విజయ్ మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పెండం సత్యనారాయణ, రీజియన్ సెక్రటరీ కందుల నరహరి, సెంట్రల్ కార్యదర్శి వడ్డేపల్లి కుమార్, డివిజన్ కార్యదర్శి సతీష్, ఆకుల హరిన్, నాయకులు పోతరాజు భాస్కర్, అంబటి మల్లికార్జున్, వివిధ మైన్లు, డివిజన్ నాయకులు, ఫిట్ సెక్రెటరీలు, సెంట్రల్ నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags:Emergency meeting of BMS chiefs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page