భయాందోళనలలో ముంపు గ్రామ ప్రజలు

0 9

రాజమండ్రి ముచ్చట్లు:

పొలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు భయంతో వణికిపోతున్నారు. దేవిపట్నం మండలం లోని పోలవరం ముంపు ప్రాంత  గ్రామ ప్రజలు భయంతో స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్తున్నారు.  పోలవరం ప్రాజెక్ట్ నిర్వసితులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ , భూమికి భూమి చెట్టుకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిన వారు తమ వైపు చూడడానికి కూడా రావట్లేదని ముంపు ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఒకవేపు పోలవరం కాపర్ డ్యామ్ మూసివేయడంతో గోదావరి వరద నీరు తమ గ్రామాల్లో చేరుకుంటుందని తమకు ఇటువంటి సదుపాయాలు లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో తమ నివాసాలను వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు తమ గృహాలను వదిలి పూర్తికాని కాలనీ తరలి వెళ్లాలని చెబుతున్నారని పునరావాస కేంద్రాలలో సదుపాయా లు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని సరైన కరెంట్ డ్రైనేజ్ మరియు రోడ్డు సదుపాయాలు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాము అని అన్నారు. దేవీపట్నం మండలంలో సుమారు 35 గ్రామాలు, మరియు గండి పోచమ్మ ఆలయం కూడా పూర్తిగా జలమయం కావడంతో దేవాలయం లో దర్శనాలు కూడా అధికారులు పూర్తిగా నిలిపి వేయడం జరిగింది.పోలవరం ముంపు ప్రాంతాలైన కొండమొదలు పంచాయ తీలో 12 గ్రామానికి ప్రజలు, తమ గ్రామాల  చుటు గోదావరి వరద నీరు చేరటంతో భయపడి కొంతమంది స్వచ్ఛందంగా తమ నివాసాలను ఖాళీ చేశారని మిగిలిన గ్రామ ప్రజలు కొండ పై నివసించేందుకు పాకాలను ఏర్పాటు చేసుకున్నారు. తమకు అన్యాయం జరిగిందని నాణ్యతలేని కాలనీ గృహాలకు వెళ్ళమని అధికారులు చెబుతున్నారని ఏమి సదుపాయం లేని చోట పిల్లలతో ఎలా నివసించాలని పలుమార్లు అధికారులు చుట్టు మరియు రంపచోడవరం పి ఓ కార్యాలయానికి పలుమార్లు కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు , అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఇకనైనా అధికారులు గాని సీఎం జగన్ తగిన న్యాయం చేయాలని ప్రభుత్వం ప్రకటించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మరియు భూమికి భూమి నష్ట పరిహా రం ఇప్పించ వలసిందిగా దేవీపట్నం మండల ముంపు ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags:The villagers were in a state of panic

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page