భారీవర్షాలతో జనజీవనం అతలాకుతలం…

0 13

లోతట్టుప్రాంతాలు జలమయం
రోడ్లపై వరదనీటితో రహదారులపై నిలిచిపోయిన రాకపోకలు
గ్రామాల్లో సర్పంచ్ ల అప్రమత్తం

*అలర్ట్ గా ఉండాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

- Advertisement -

జగిత్యాల  ముచ్చట్లు:

జగిత్యాల జిల్లాలో గత రెండురోజులుగా ఎడాతేరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షలతో జనజీవనం అతలాకుతలమవుతుంది. బుధవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జగిత్యాల పట్టణం, జిల్లాలలోని వివిధ పట్టణ ,మండాలాలు ,గ్రామాలాల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.గ్రామాల్లో సర్పంచ్లు అప్రమత్తమై పరిస్థితులను పర్యవేక్షస్తున్నారు.జిల్లాలో పలు రహదారులపై వరదనీటిప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయి  ప్రజలు  ఇబ్బందులు పడ్డారు. వాగులు, వంకలు ఉదరుతంగా ప్రవహిస్తుండడంతో పొలాల్లో ఇసుక మెటలు పెట్టాయి. అధికారులను జిల్లా కలెక్టర్ రవి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.జగిత్యాల – ధర్మపురి రహదారిపై గుల్లపేట వద్ద వంతెనపై వరదనీరు ప్రవహిస్తుండడం, నేరెళ్ల గుట్ట వద్ద ఉన్న లోలెవల్ వంతెన వరదనీటితో మునిగిపోవడం మూలంగా రాకపోకలు స్తంభించిపోయాయి.అలాగే సారంగాపూర్ వెళ్లే రూటులో హైదర్పల్లి వద్ద రోడ్డుపై వరదప్రవాహం ఉండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొడిమ్యాల మండలంలో నాచుపల్లి వద్ద రోడ్డుపై వరదనీటితో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పెగడపల్లి మండలం బతికేపెల్లి, లింగాపూర్, బుగ్గారం మండలం చిన్నపూర్,చందయ్యపల్లె,  రాయికల్, మెట్పల్లి, కోరుట్ల, బీరుపూర్, మేడిపల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం,  గొల్లపల్లి, వెల్గటూరు, మల్యాల మండల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయామయ్యాయి. రాయికల్ మండలం బోర్నపల్లిలో పాఠశాలలోకి నిరుచేరి ఇబ్బందింగామారింది.
వరదనీటితో  వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి.ఎడాతేరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా మారింది.

జగిత్యాల పట్టణంలోని ప్రధాన రహదారుపై పలు చోట్ల నీరు నిలవడంతో రహదారిపై వెళ్లే వాహనాలతో నిలువ ఉన్న వరద నీరు రాకపోకలు సాగించే వారిపై ఎగిసిపడుతుండడంతో ఇతరుల కు ఇబ్బందిగా మారింది. ఇటీవలి పైప్ లైన్ తవ్వకాల వల్ల ఆయా ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడం వల్ల ఆ ప్రాంతంలో వ్యాపార నిర్వాహకులకు ఇబ్బందిగా మారింది.
జగిత్యాలలో కొన్ని కాలనీల్లో  రోడ్లపై  వరద నీటితో పాటు మురికి కాలువల నీరు కలిసిపోయి రోడ్లపై ప్రవహిస్తుండడంతో వాహనచోదకులకు అంతరాయంగా మారింది. గోవిందుపల్లె వెంకటద్రినగర్ తో పాటు పలు ప్రాంతాలు భారీవర్షం కారణంగా జలధిగ్బంధంలో ఉన్నాయి.మున్సిపల్ ఛైర్పర్సన్ భోగ శ్రావణి లోతట్టు ప్రాంతాలను సందర్శించి అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. గ్రామాల్లో సర్పంచ్ లు వర్షాల కారణంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు సమాచారం అందిస్తున్నారు.  మరో రెండు రోజులు పాటు భారీ, అతి భారీ, మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ వెల్లడించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.స్తుతం కురుస్తున్న వర్షాలతో పలు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు వరద నీరు నిలిచి కుంటలను తలపిస్తుండగా ఆయా కాలనీల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
మరో రెండు రోజులు భారీ వర్ష సూచనలు ఉన్న కారణంగా గత నాలుగు రోజుల క్రితమే జగిత్యాల జిల్లా కలెక్టర్ భారీ వర్షాలకు ఎలాంటి నష్టం, ప్రమాదాలు జరగకుండా అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.
అలాగే గురువారం అన్ని శాఖల అధికారులతో సమీక్షా చేశారు.సహాయక చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలతో జిల్లా పంచాయతీ అధికారి సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులకు వాయిస్ మెసేజ్ ద్వారా అలర్ట్ చేశారు.

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

Tags:Heavy rains make life miserable …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page