మూడున్నర కోట్లకు కుచ్చుటోపీ

0 26

తిరుమల ముచ్చట్లు :

 

 

అధిక వడ్డీలు, బంగారం స్కీం, చిట్టీల పేరిట వందలాది మంది నుంచి సేకరించిన కోట్లాది రూపాయలతో తండ్రీ కొడుకులు కుటుంబంతో సహా పరారయ్యారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దొరసానిపాడుకు చెందిన సీమకుర్తి హనుమంతరావు, అతని కుమారుడు రాజా పదేళ్ల క్రితం నుంచి లక్ష్మీపురంలో ఉంటూ చిట్టీలు నడుపుతున్నారు. కరోనా కారణం చెప్పి పాడుకున్న వారికి సకాలంలో సొమ్ములు ఇవ్వక, అధిక వడ్డీతో చెల్లిస్తామంటూ నమ్మబలికి వందలాది మంది సొమ్మును తమ వద్దనే ఉంచుకున్నారు. రాజా ద్వారకా తిరుమలలో శ్రీ వెంకట గణేష్‌ జ్యువెలరీ షాపును నిర్వహిస్తున్నాడు. 15 నెలలపాటు నెలకు రెండు వేల చొప్పున చెల్లిస్తే 16వ నెల బోన్‌సగా మరో రెండు వేలు కలిపి 32 వేలకు బంగారం, వెండి వస్తువులు ఇస్తామని స్కీం మొదలు పెట్టాడు. సుమారు 200 మందికిపైగా ఈ స్కీంలో చేరారు. కొన్ని రోజులుగా షాపు తీయడం మానేసాడు. చుట్టుపక్కల వారిని విచారించగా, కొన్ని రోజుల క్రితమే అతను కుటుంబ సభ్యులతో వెళ్లిపోయినట్లు తేలింది. మోసపోయామని తెలుసుకుని లబోదిబోమన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు భీమడోలు సీఐ సుబ్బారావు తెలిపారు.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags: Three and a half crores

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page