రాజ్యసభలో గందరగోళం

0 15

మంత్రి చేతుల్లోంచి పేప‌ర్లు లాగి.. చింపేసిన‌ టీఎంసీ ఎంపీలు
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
రాజ్య‌స‌భ‌లో ఇవాళ గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. పెగాస‌స్ స్పైవేర్ అంశంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ ప్ర‌క‌ట‌న చేస్తున్న స‌మ‌యంలో.. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అనుచితంగా వ్య‌వ‌హ‌రించారు. మంత్రి వైష్ణ‌వ్ చేతుల్లోంచి స్టేట్‌మెంట్ పేప‌ర్లు లాగారు. ఆ త‌ర్వాత ఆ పేప‌ర్లు చింపివేసి .. వెల్‌లోనే వెద‌జ‌ల్లారు. టీఎంసీ ఎంపీల వైఖ‌రిపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతున్న‌ది. ఎంపీల ప్ర‌వ‌ర్త‌న తీరును డిప్యూటీ చైర్మ‌న్ హ‌రివంశ్ ఖండించారు. గంద‌ర‌గోళం న‌డుమ ఆయ‌న స‌భ‌ను రేప‌టికి వాయిదా వేశారు. గ‌తంలోనూ టీఎంసీ ఎంపీలు.. నూత‌న రైతు చ‌ట్టాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్న స‌మ‌యంలో.. చైర్ మైక్ లాగేసిన విష‌యం తెలిసిందే.తాజాగా టీఎంసీ ఎంపీ శంత‌ను సేన్‌.. మంత్రి వైష్ణ‌వ్ చేతుల్లోంచి పేప‌ర్లు లాగేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర మంత్రి హ‌రిదీప్ సింగ్ పుర‌తి, ఎంపీ శంత‌ను సేన్ మ‌ధ్య మాట‌ల ఘ‌ర్ష‌ణ కొన‌సాగింది. పెగాస‌స్ ప్రాజెక్టు రిపోర్ట్‌ను చ‌దువుతున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. టీఎంసీ ఎంపీల ప్ర‌వ‌ర్త‌న‌ను బీజేపీ ఎంపీ స్వ‌ప‌న్‌దాస్ గుప్తా ఖండించారు. మంత్రి చేతుల్లోంచి పేప‌ర్ లాగేసిన అంశాన్ని ప్ర‌శ్నించ‌గా.. ఎంపీ ఎంపీ సుకేందు శేఖ‌ర్ రాయ్ స‌మాధాన్ని దాటేశారు
లోకసభలో సేమ్ సీన్
కృష్ణాన‌ది జ‌లాల‌పై వివాదం ఇవాళ లోక్‌స‌భ‌లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ అంశం గురించి మాట్లాడారు. శ్రీశైలం జ‌లాశ‌యం నుంచి అక్ర‌మ‌రీతిలో తెలంగాణ జెన్‌కో విద్యుత్తును ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఆయ‌న మాట్లాడుతూ.. శ్రీశైలాం జ‌లాశ‌యంలో నీటి స్థాయి మినీమ‌మ్ 854 ఫీట్లు ఎత్తు ఉండాల‌ని, కానీ 800 ఫీట్ల ఎత్తులో ఉన్న‌ప్పుడు తెలంగాణ జెన్‌కో విద్యుత్తు ఉత్ప‌త్తి చేస్తోందని ఆరోపించారు. ఆదేశాలు ఇచ్చినా విద్యుత్తు ఉత్ప‌త్తి జ‌రుగుతోందన్నారు.. దీని వ‌ల్ల రాయ‌ల‌సీమ‌కు నీటి క‌ష్టాలు వ‌స్తాయ‌న్నారు. అన్‌టైమ్‌లీ జ‌న‌రేష‌న్ ఆపాల‌న్నారు. ఏపీ, చెన్నై ప్ర‌జ‌ల సంక్షేమం కోసం విద్యుత్తును ఆపాల‌న్నారు. ఈ ప్ర‌శ్న‌కు జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ ష‌కావ‌త్ బ‌దులిస్తూ.. జెన్‌కోను విద్యుత్తు ఆపాల‌ని కోరామ‌న్నారు. కానీ జెన్‌కో విద్యుత్తు ఉత్ప‌త్తి చేస్తోంద‌ని మంత్రి తెలిపారు.ఎంపీ అవినాశ్ మ‌రో అద‌న‌పు ప్ర‌శ్న వేశారు. పాల‌మూరు ఇరిగేష‌న్ స్కీమ్‌కు.. ఎన్విరాన్‌మెంట్ క్లియ‌రెన్స్ లేద‌న్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేష‌న్ డ్యామ్‌తో తెలంగాణ ప్ర‌భుత్వం 8 టీఎంసీల‌ నీటిని ప్ర‌తి రోజు వాడుకుంటుంద‌ని ఆరోపించారు. పాల‌మూరు వ‌ల్ల ఏపీ, చెన్నైకి తాగునీటికి క‌ష్టాలు ఏర్ప‌డుతాయ‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు. జ‌ల మంత్రి షెకావ‌త్ స్పందిస్తూ.. ఇంట‌ర్ స్టేట్ ఒప్పందాల ప్ర‌కారం .. కృష్ణా, గోదావ‌రి బోర్డుల‌కు లేఖ‌లు రాశామ‌న్నారు. రెండు బోర్డుల‌కు నోటిసు ఇచ్చామ‌న్నారు. బోర్డుల‌కు శ‌క్తి పెరుగుతోంద‌న్నారు. భ‌విష్య‌త్తులో ఇలాంటివి జ‌ర‌గ‌కుండా చూస్తామ‌న్నారు. రెండు రాష్ట్రాల్లోనూ సీడ‌బ్ల్యూసీ అనుమ‌తి లేకుండా ప్రాజెక్టులు కొన‌సాగుతున్న‌ట్లు కేంద్ర మంత్రి ఆరోపించారు. మ‌రో వైపు రైతు చ‌ట్టాల‌పై విప‌క్షాలు స‌భ‌లో నినాదాలు చేయ‌డంతో స‌భ‌ను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వాయిదా వేశారు.

 

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

- Advertisement -

Tags:Confusion in the Rajya Sabha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page