వానలపై కేసీఆర్ సమీక్ష

0 18

హైదరాబాద్  ముచ్చట్లు:
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న వేళ తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో పెరుగుతున్న వరద తాకిడిపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. యుద్ధ ప్రాతిపదికన ఆయా ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపాలని సీఎస్‌కు సూచించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉండడంతో ప్రజాప్రతినిధులంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని సీఎం ఆదేశించారు. నిజామాబాద్‌ జిల్లాలో భారీవర్షాలు కురుస్తుండడంతో.. తక్షణమే పర్యవేక్షించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి సూచించారు.
అధికారులకు కేటీఆర్ ఫోన్
మరోవైపు, రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలపై కలెక్టర్ కృష్ణబాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డేలతోక కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. రానున్న మరో రెండుమూడు రోజులు కూడా భారీగా వానలు పడే అవకాశం ఉంటుందన్న వాతావరణ శాఖ వారి హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్ర స్థాయి అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పొంగుతున్న వాగుల వద్ద తగు హెచ్చరికలను, వేరే దారులను సూచించే గుర్తులు ఏర్పాటు చేయాలని సూచించారు.పాత ఇండ్లలో ఉన్నవారిని గుర్తించి సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా వర్షకాలంలో గ్రామాల మధ్య ఉన్న చిన్నచిన్న వాగులను దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎగువ మానేరు జాలశయ నీటి మట్టం పూర్తి స్థాయిలో నిండి మత్తడి దుంకుతుందని, జలాశయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
మరో 3 రోజులు జాగ్రత్త
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరో మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని  హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని 7 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ 12 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, సిద్ధిపేట, కామారెడ్డి, వరంగల్, హన్మకొండ, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతోపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపుల అలజడి ఉంటుందని హెచ్చరించింది.గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. నది జలాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. తెలంగాణలోని ప్రాజెక్టులు నిండు కుండను తలపిస్తున్నాయి.ఇదిలావుంటే.. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. నది తీర ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు హై అలర్ట్‌తో ఉండాలని ఆదేశించారు సీఎం కేసీఆర్‌. సహాయ చర్యలు చేపట్టేందుకు సహాయ బృందాలు రెడీ అండాలని సూచించారు.SRSP ప్రాజెక్ట్‌ నిండుతోంది. ఎల్లంపల్లి, కడెం గేట్లు తెరిచారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంత అధికారులు అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించారు.

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

- Advertisement -

Tags:KCR review on rains

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page