వైయస్సార్ కాపు నేస్తం పథకం ప్రారంభం

0 8

కాపులను ఆదుకునే ప్రభుత్వం వైఎస్సార్ ప్రభుత్వం
శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు
మండపేట   ముచ్చట్లు:
సంక్షేమ కార్యక్రమాల అమలులో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలోనే నెంబర్ ఒన్ స్థానంలో నిలుస్తుందని శాసనమండలి సభ్యులు, వైసీపీ మండపేట నియోజకవర్గ ఇంచార్జ్ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని గురువారం శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి లతో కలిసి ప్రారంభించారు. సభకు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వర రావు అధ్యక్షత వహించారు. చైర్ పర్సన్  దుర్గారాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మలు ఆనందంగా గడపాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  కోరుకుంటున్నారని అన్నారు. అందులో భాగంగానే ప్రతి మహిళకు ఏదో ఒక ప్రభుత్వ సంక్షేమ పథకం అందేలా చూస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ కాపు నేస్తం పథకాన్ని 45 సంవత్సరాలు నిండిన ప్రతి పేద కాపు మహిళ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ పథకం వలన రాష్ట్రంలో ఉన్న ఎంత మంది కాపు మహిళలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు మాట్లాడుతూ కాపు నేస్తం పథకం ద్వారా 45 సంవత్సరముల నుండి 60 సంవత్సరముల లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద మహిళలకు సంవత్సరమునకు 15000 వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రానికి సంబంధించి సుమారు 480 కోట్లు లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని అన్నారు.

 

మండపేట నియోజకవర్గానికి సంబంధించి మండపేట పట్టణానికి సంబంధించి  1316, మండపేట మున్సిపాలిటీకి సంబంధించి 634, రాయవరం మండలానికి సంబంధించి 607, కపిలేశ్వరపురం మండలానికి సంబంధించి 1341 మంది లబ్ధిదారులు ఈ పథకంలో లబ్ధి పొందనున్నారని అన్నారు. మొత్తం 3898 మందికి ఐదు కోట్ల ఎనభై నాలుగు లక్షలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, ఎంపీడీవో ఐదం రాజు, వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి, కర్రి పాపారాయుడు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వనజ రెడ్డి, మీగడ శ్రీనివాస్, పిల్లి గణేశ్వరరావు, దూలం వెంకన్న బాబు, ముమ్మిడివరపు బాపిరాజు, పోతంశెట్టి ప్రసాద్, గ్రంధి శ్రీనివాస్, టిడిపి పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, పిల్లా వీరబాబు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు,  లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

Tags:Vyassar Kapu Nestam scheme started

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page