శ్రీ కపిలేశ్వరస్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ

0 11

తిరుపతి    ముచ్చట్లు:
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల్లో రెండో రోజైన గురువారం స్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ జరిగింది.  కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.   ఇందులో భాగంగా ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు హోమం, గ్రంథి పవిత్ర సమర్పణ చేపట్టారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌పూజ‌, హోమం నిర్వ‌హిస్తారు.    ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్  భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు  రెడ్డిశేఖ‌ర్,  శ్రీ‌నివాస నాయ‌క్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

- Advertisement -

Tags:Gland sacred offering to Sri Kapileswaraswamy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page