సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాకు రూ,3 కోట్ల నష్టం పొంగిపొర్లుతున్న వాగులు

0 12

భద్రాద్రి  ముచ్చట్లు:
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నిన్నటిదాకా వెలవెల బోయిన చెరువులు, కుంటలు నీటితో కలకలలాడుతున్నాయి.సింగరేణి ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. వాయిస్ ఓవర్; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. మణుగూరు,పినపాక,అశ్వాపురం మరియు కరకగూడెం మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మణుగూరులోని గుర్రపేటవాగు పినపాకలోని బయ్యారం వాగులు ఉరకలేస్తున్నాయి. భారీ వర్షాలకు సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచింది. ఏరియాలో ప్రతీరోజు సుమారు 35 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాల్సివుండగా వర్షం కారణంగా ఉపరితల గనులలో ఉత్పత్తి నిలిచిపోవడంతో… ఏరియాకు సుమారు రూ,3 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా.ఉపరితల గనులలో బొగ్గును వెలికితీయాల్సిన భారీ యాంత్రాలు వర్షాలకు నిలిచిపోయాయి.  కోల్ బెంచ్ ల్లోకి  వర్షపునీరు వచ్చి చేరుతుండడంతో భారీ మోటార్ల ద్వారా వర్షపు నీటిని బయటకు పంపింగ్ చేస్తున్నారు సింగరేణి అధికారులు.

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

- Advertisement -

Tags:Singareni Calories loses Rs 3 crore to Manuguru area
Overflowing ditches

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page