24న డాక్టర్ వై ఎస్ ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం  నలుగురు మంత్రులు జిల్లాకు రాక

0 20

నెల్లూరు   ముచ్చట్లు:
రైతుల ప్రయోజనాలు ఆశించి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల వ్యయంతో, కావలిలో మండల ప్రజాపరిషత్ వెనుక నిర్మించిన డాక్టర్ వై ఎస్ ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను ఈ నెల 24 వతేది  రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బాలినేని శ్రీనివాసులురెడ్డి , మేకపాటి గౌతమరెడ్డి , పీ అనీల్ కుమార్ యాదవ్ , కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభోత్సవానికి నోచుకోబోతుంది . వ్యవసాయ , మత్స్య ,  పశుసంవర్ధక అనుబంధశాఖల సమగ్ర సమన్వయ ల్యాబరేటరీ ఇది . రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇలాంటి ల్యాబులు 70 నిర్మించింది . నెల్లూరు జిల్లాలో  8 ల్యాబుల్ని ప్రభుత్వం నిర్మిస్తుంది . అయితే కావలిలో నిర్మించిన ఈ ల్యాబ్ సౌకర్యాలు మాత్రం జిల్లాలో మరెక్కడా లేవు . వ్యవసాయ , పశుసంవర్ధక , మత్స్య శాఖలు ఒకే చోట కలిసివుండే ల్యాబ్ ఇదే . అదే దీని ప్రత్యేకత .

కావలిలో ప్రారంభించబోయే డాక్టర్ వై ఎస్ ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ రైతులకు అందించబోయే సేవలను గురించి కావలి వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కే కన్నయ్య తెలియజేసిన వివరాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు , ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ డాక్టర్ వై ఎస్ ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ రాష్ట్రవ్యాప్తంగా నిర్మించడం జరిగిందన్నారు . గతంలో రాష్ట్రంలో కేవలం 3 ల్యాబులు మాత్రమే వుండేవని , ఇప్పుడు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, రైతుల సౌకర్యార్థం వారికి మేలుచేసే ఉద్దేశ్యంతో 70 ల్యాబులు నిర్మింస్తుందన్నారు . కావలిలో నిర్మించిన ఈ ల్యాబ్ భవనంలో క్రింది అంతస్తులో వ్యవసాయశాఖకు సంబంధించిన ల్యాబ్ ఉంటుందని , పై అంతస్తులో పశుసంవర్ధక మరియు మత్య శాఖలకు సంబంధించిన ల్యాబ్స్ ఉంటాయన్నారు . వ్యవసాయశాఖ ల్యాబ్ లో ఇద్దరు అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ అధికారులు వుంటారని ,  ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ( ఏ ఓ ) టెక్నీకల్ గైడెన్స్ కోసం ఉంటారన్నారు .తమ ల్యాబులో మండల వ్యవసాయ అధికారులు పంపిన విత్తనాలు , ఎరువుల నమూనాల్ని విశ్లేషించడం జరుగుతుందన్నారు . వ్యవసాయశాఖ అధికారులు తీసిన  శాంపిల్స్ కోడింగ్ సెంటర్లకు పంపిస్తామన్నారు . రాష్టంలో రీజినల్ డీకోడింగ్ సెంటర్లు విశాఖపట్నం , గుంటూరు , తిరుపతి లలో ఉన్నాయన్నారు . డీకోడింగ్ సెంటర్లకు పంపిన శాంపిల్స్ ను వాళ్ళు డీకోడ్ చేసి రాష్ట్రంలో ఉన్న 70 ల్యాబులలో ఏదో ఒకదానికి పరీక్షల నిమిత్తం పంపుతారని తెలిపారు . శాంపిల్స్ పరీక్షలు అంతా గోప్యంగా జరుగుతాయన్నారు . రైతులు తాము కొనుగోలు చేసిన విత్తనాలు , ఎరువులు నేరుగా ల్యాబ్ కు తెచ్చి పరీక్షించుకోవచ్చన్నారు . ఈ పరీక్షలన్నీ  ఉచితంగా చేస్తామన్నారు . అయితే రైతు తాము కొనుగోలు చేసిన రసీదు ల్యాబ్ అధికారులకు అందజేయాలన్నారు . నియోజకవర్గం స్థాయిలో  పర్యవేక్షణకు వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వుంటారని , జిల్లా స్థాయిలో జాయింట్ డైరెక్టర్ ఉంటారన్నారు.లాగే మత్స్య శాఖ అధికారులను ఆక్వా కల్చర్ కు సంబంధించిన శాంపిల్స్ పరీక్షలు చేయించుకోవచ్చునని , ఆక్వాలో తలెత్తే సమస్యలు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకొనే సదుపాయం ఉందన్నారు . పశుసంవర్ధక శాఖ ల్యాబులో పశువుల పేడ ,పశువుల రక్త పరీక్షలు చేస్తారన్నారు . ప్రభుత్వం రైతుల శ్రేయస్సుకోరి నిర్మించిన డాక్టర్ వై ఎస్ ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లో ఉన్న అన్ని సౌకర్యాలు రైతులు వినియోగించుకోవాలని ఏడీ కన్నయ్య రైతుల్ని కోరారు.

- Advertisement -

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

 

Tags:Dr. YSR Agri Testing Lab opens on the 24th
Arrival of four ministers in the district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page