ఒక్క సంవత్సరం కలిపి మెడికల్ బోర్డు అప్లై చేసుకునెలా చూడాలి

0 13

– ఐఎన్టియుసి జనరల్ సెక్రటరీ పి.ధర్మపురి

పెద్దపల్లి ముచ్చట్లు:

- Advertisement -

సింగరేణిలో 60 నుండి 61 సంవత్సరాలు పెంచిన ఒక్క సంవత్సరం సర్వీస్ లో కలిపే విధంగా, మెడికల్ బోర్డు అప్లై చేసుకునే విధంగా పొందుపరచాలని ఐఎన్టియుసి జనరల్ సెక్రటరీ పి.ధర్మపురి డిమాండ్ చేశారు. శుక్రవారం గోదావరిఖని లోని ఐఎన్టియుసి ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు 8 కొత్త బొగ్గు గనులు ప్రారంభించి 11 వేల మంది నిరుద్యోగ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానన్నాడని, కానీ ఇవ్వలేదని, వాటిని కూడా ప్రారంభించలేదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తా అన్నాడని, కానీ ఒక్కరిని కూడా చేయలేదన్నారు. ఇన్కమ్ టాక్స్ రద్దు చేస్తా అన్నాడని, కానీ చేయించలేదని, ఢీఎంఎఫ్ నిధులు ఈ ప్రాంతంలో ఖర్చు చేయాలి కానీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో ఖర్చు చేశాడన్నారు. ఐటీ పార్కు తెచ్చి అనుబంధ పరిశ్రమలు తెస్తా అన్నాడని, కానీ తేలేదని, 10 వేల కొత్త క్వార్టర్స్ కడతా మన్నారని, కానీ ఒక్కటి కూడా కట్టలేదని ఆరోపించారు. ఏరియాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి ఆ ఆస్పటల్ లోనే బిపి చూసుకుంటా అన్నాడు కానీ, ఒక్కటి కూడా కట్టలేదని, అవినీతి నిర్మూలిస్తాం అని అన్నాడు కానీ, అవినీతి పెరిగిపోయిందన్నారు. కావున వాటిని వెంటనే నెరవేర్చి ముఖ్యమంత్రి ప్రకటించిన 61 సంవత్సరాల సర్వీసును కార్మికులకు ఉపయోగపడే విధంగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆర్జీ 2 వైస్ ప్రెసిడెంట్ అక్బర్ అలీ, యూనియన్ ప్రధాన కార్యదర్శి పూసాల తిరుపతి, కార్పొరేషన్ యూనియన్ అధ్యక్షుడు పవన్ కుమార్, తాటి రాజయ్య, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

 

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags:The medical board should see to it that one year is combined

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page