కట్నంతో పాటు తాబేళ్లు, నల్లకుక్క

0 10

ముంబై  ముచ్చట్లు:
ఎన్ని చట్టాలు వచ్చినా దేశంలో వరకట్న వేధింపులకు అడ్డుకట్ట పడటం లేదు. నిత్యం ఏదో ప్రాంతంలో వేధింపులు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలో వరకట్నంతో ఓ పెళ్లికొడుకు వింత కోరికలు కోరిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఔరంగాబాద్‌ నగరానికి చెందిన ఓ యువకుడికి ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. కట్నంగా వధువు తల్లిదండ్రులు వరుడికి రూ.2 లక్షల నగదు, తులం బంగారం ముందుగానే ఇచ్చారు. ఆ తర్వాత అందరూ పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు. అంతా సవ్యంగా సాగిపోతోందని అనుకుంటున్న సమయంలో వరుడు తన వింత కోరికల చిట్టాను బయటపెట్టాడు.తనకు కట్నంగా రూ.10లక్షలు కావాలని డిమాండ్ చేయడంతో పాటూ 21 తాబేళ్లు, ఓ నల్ల కుక్క, బుద్ధుడి బొమ్మ, దీపం కుందెలు కావాలని పట్టుబట్టాడు. దీంతో వధువు కుటుంబం ఒక్కసారిగా షాకైంది. ఇలాంటి వింత కోరికలు వద్దంటూ వరుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా అతడు వెనక్కి తగ్గలేదు. ఎంత బ్రతిమాలినా వరుడు మనసు మార్చుకోకపోవడంతో తాను పెళ్లిచేసుకోకని తెగేసి చెప్పాడు. దీంతో వధువు కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అతడిపై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు..

 

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

- Advertisement -

tags:Tortoises along with turtles, black dog

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page