కలెక్టరేట్ ఎదురుగా గిరిజన సంఘం నాయకుల అర్ధనగ్న ప్రదర్శన

0 23

నెల్లూరు  ముచ్చట్లు:
ఐటీడీఏ పీవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గత 13 రోజులుగా యానాదుల గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం  స్థానిక  కలెక్టరేట్ ఎదుట అర్దనగ్న ప్రదర్శన, మోకాళ్లపై నిలబడి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు వారాలుగా ఐటీడీఏ పీవో మణికుమార్ పై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు స్పందన కరువైందన్నారు. శనివారం నుండి  ఆందోళన ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యానాదుల సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు తలపల ప్రభాకర్ మాట్లాడుతూ యానాదులు గత 13 రోజులుగా ఆందోళనా చేస్తున్నా  జిల్లా అధికార యంత్రాంగం స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఐటీడీఏ పీవో మణికుమార్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి చట్ట రీత్యా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా
సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య మాట్లాడుతూ శనివారం నుండి  అధునాతన పద్ధతిలో ఆందోళనా కార్యక్రమాలను ఉదృతం చేస్తామని అధికారులకు రిలే దీక్షలు ద్వారా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బి ఎల్ శేఖర్, ప్రధాన కార్యదర్శి రాపూరు కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇండ్ల రవి, యువజన విభాగం అధ్యక్షులు యల్లంపల్లి రమేష్, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఇండ్ల మల్లి, మహిళా నాయకురాలు చెంబేటి ఉష, చెంచురామయ్య, మానికల మురళీ, గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఏకోల్లు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

- Advertisement -

Tags:Half-naked display of tribal community leaders in front of the Collectorate

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page