కేసీఆర్ అంబేద్కర్ వారసుడు

0 13

హైదరాబాద్  ముచ్చట్లు:
లంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. దళిత సాధికారత కోసం దళిత బంధు పథకం తెచ్చిన కేసీఆర్ ని గౌరవించాలన్నారు.ఎమ్మెల్యే రఘునందన్ కూడా దళిత సాధికారిత మీటింగ్ కు వెళ్లాలని చెప్పారన్నారు. కానీ పార్టీ వెళ్లవద్దని నిర్ణయం తీసుకుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన దళితుల అభ్యున్నతికి మీటింగ్ చరిత్రాత్మకమైనదని అన్నారు మోత్కుపల్లి.ఈ సందర్భంగా ఈటలపై కీలక ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్ అవినీతి పరుడు,అక్రమదారుడని ఆరోపించారు. దళితుల, దేవుడి భూముల కబ్జా చేసిన వ్యక్తి ని ఎలా బీజేపీలో చేర్చుకున్నారని మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ని పార్టీలో చేర్చుకోవడం తనను బాధించిందన్నారు. తన అనుభవాన్ని పరిగణలోకి తీసుకోలేదని తన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలో సముచిత స్థానం దక్కలేదని అన్నారు.ఈటెల రాజేందర్ అయ్యో పాపం అన్నట్లు ఉంటాడని ఎద్దేవా చేశారు. వేల కోట్ల భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఈటెల బలుపెక్కిన వ్యక్తి అని మోత్కుపల్లి నర్సింహులు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈటెల రాజేందర్ కు పోటీ చేయడానికి అర్హత లేదన్నారు. ఈటెల రాజేందర్ ని హుజురాబాద్ ప్రజలు బహిష్కరించాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.ఈటల రాజేందర్ గెలవడానికి వీలు లేదని మోత్కుపల్లి ఫైర్ అయ్యారు.కేసీఆర్ మంచి కార్యక్రమం చేపట్టారు. అందులో తనను భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని మోత్కుపల్లి తెలిపారు. రాజకీయాలు తన సొంత పనుల కోసం చేయలేదన్నారు. పేద ప్రజల కోసం చేశానన్నారు. అంబేద్కర్ వారసుడు కేసీఆర్ అని ప్రశంసల వర్షం కురిపించారు.దళితులు ఏకం కావాలి… హుజురాబాద్ లో టిఆర్ఎస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీల్లోని దళితులందరూ కలిసి… టిఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు.కేసీఆర్ మానవతావాది… అన్ని రకాలుగా నష్టపోయిన వర్గాలను తలెత్తుకునేలా చేశాడన్నారుదళిత బంధుని నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో వేయాలని సీఎం కేసీఆర్ కి తానే చెప్పినని అన్నారు.మరియమ్మ లాకప్ డెత్ కేసులో బాధ్యులను కేసీఆర్ డిస్మిస్ చేయించారు. దళిత బంధు ప్రకటించినందుకు కేసీఆర్ కు దండోరా, డప్పు చాటింపు వేసి మోత్కుపల్లి నర్సింహులు ధన్యవాదాలు తెలియజేశారు.
బీజేపీకి లేఖ
ప్రముఖ సీనియర్ రాజికీయ నేత మోత్కుపల్లి నర్సింహులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు తన రాజీనామా లేఖ పంపారు. రాష్ట్ర ప్రజలకు నిస్వార్థ సేవ చేసేందుకే తాను బీజేపీలో చేరానన్నారు. అయితే తన అనుభవాన్ని, సుదీర్ఘరాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకొని తనకు బీజేపీలో సముచిత స్థానం కల్పించలేకపోయారన్నారు. అందుకే తాను చాలా బాధపడుతున్నానని లేఖలో మోత్కుపల్లి పేర్కొన్నారు.కనీసం కేంద్ర కమిటీలో ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. తన అనుభవాన్ని పరిగణలోనికి తీసుకొని తనకు అవకాశాలు కల్పించడంలో పార్టీ విఫలం చెందిందని మోత్కుపల్లి ఆరోపించారు. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన దళిత సాధికారిత సమావేశానికి తన అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ఆహ్వానిస్తే బండి సంజయ్‌కు చెప్పి వెళ్లడం జరిగిందన్నారు. అయితే ఆ విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం తనను బాధించాయన్నారు మోత్కుపల్లి.అంతేకాకుండా పార్టీలో ఈటల రాజేందర్ చేరిక కూడా తనను బాధించిందన్నారు. తనను ఒక్క మాట కూడా అడగకుండా ఈటల రాజేందర్‌ను బీజేపీలోచేర్చుకోవడం తనను ఇబ్బందికి గురి చేసిందన్నారు. ఎస్సీ వర్గాల భూముల్ని ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్నందుకు కనీసం వివరణ కూడా తీసుకోకుండా పార్టీలో చేర్చకున్నారన్నారు. రాజకీయాల్లో విలువల కోసమే పనిచేసే తనను దూరం పెట్టడం బాధకరమన్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మోత్కుపల్లి లేఖలో పేర్కొన్నారు.

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

- Advertisement -

Tags:Successor of KCR Ambedkar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page