గ్రాండ్ గా ఒలింపిక్ సెర్మనీ

0 11

టోక్యో ముచ్చట్లు:

మెగా స్పోర్టింగ్ ఈవెంట్ ఒలింపిక్స్ ప్రారంభ‌మ‌య్యాయి. జ‌పాన్ రాజ‌ధాని టోక్యో ఆతిథ్య‌మిస్తున్న 32వ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మ‌నీ మొద‌లైంది. జ‌పాన్ చక్ర‌వ‌ర్తి న‌రుహిటో ఈ గేమ్స్‌ను ప్రారంభించారు. ప్ర‌తిసారీ ఎంతో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగే వేడుక‌ల‌ను ఈసారి ప్రేక్ష‌కులు లేకుండానే సింపుల్‌గా నిర్వ‌హిస్తున్నారు. టీమ్స్ ప‌రేడ్‌లో పాల్గొనే అథ్లెట్ల సంఖ్యను కూడా ఈసారి ప‌రిమితం చేశారు.ఇండియా త‌ర‌ఫున కేవ‌లం 19 మంది అథ్లెట్లు, ఆరుగురు అధికారులు మాత్ర‌మే పాల్గొంటున్నారు. ఈ గేమ్స్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ అత్య‌ధికంగా భార‌త్ నుంచి 127 మంది అథ్లెట్లు పోటీ ప‌డుతున్నారు. మొత్తంగా ఆగస్టు 8 వరకు జరిగే ఒలింపిక్స్‌లో 11,500 మంది అథ్లెట్లు తలపడనున్నారు. 42 వేదికల్లో జరిగే విశ్వక్రీడల్లో 205 దేశాలతో పాటు ఓ శరణార్థి జట్టు కూడా పాల్గొననుంది. ఈ ఓపెనింగ్ వేడుక‌ల‌కు హాజ‌రైన అతిథుల్లో అమెరికా ఫ‌స్ట్ లేడీ జిల్ బైడెన్‌, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఉన్నారు.

 

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags:Olympic Sermon as Grand

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page