జాతీయ రహదారి బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలి

0 16

లేదంటే పనులు సాగనివ్వకుండా అడ్డుకుంటాము
గ్రామసభ ఆమోదం తీసుకోవాలి
పాడేరు    ముచ్చట్లు:

జాతీయ రహదారి గ్రీన్ ఫిలిడ్ రోడ్ బాధితులకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా రోడ్ నిర్మాణం పనులు చేయడం సరికాదని తాత్కాలిక పనులు నిలుపుదల చేయాలని జాతీయ రహదారి భూసేకరణ అధికారి,పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్ గారికి విజ్ఞప్తి చేస్తూ గిరిజన సంఘం వినతిపత్రం సర్పించారు.పాడేరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో  సబ్ కలెక్టర్ అభిషేక్ గారితో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిల్లో సురేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.సూర్యనారాయణ, డుంబ్రి గూడ మండలం సిపిఎం కార్యదర్శి ఎస్.బి.పోతురాజ్  ఆధ్వర్యంలో సుమారు 10 గ్రామాల రహదారి బాధితులు కలిసి వినతి పత్రం అందజేశారు.
గ్రీన్ ఫిలిడ్ నేషనల్ హైవే నిర్మాణం కోసం జనవరి2020లో నోటిఫికేషన్ జారీ చేశారు.21 రోజులోపాటు అభ్యంతరాలు రాతపూర్వకంగా ఇవ్వాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. బాధితులు తెలిపిన అభ్యంతరాలపై నేటికి భూసేకరణ అధికారికంగా స్పందించలేదని,గ్రామసభ ఆమోదం లేకుండానే, కనీసం బాధితులకు సమాచారం కూడ ఇవ్వకుండానే జాతీయ రహదారి నిర్మాణం పనులు ముమ్మరంగా చేస్తున్నారని. నేటికి బాధితులు జాబితా ప్రకటన విడుదల చేయాలేదని, చాపరాయి నుండి రోడ్ మ్యాప్ మార్చాలని డుంబ్రి గూడ చుట్టుపక్కల గ్రామ ప్రజలు దరఖాస్తు చేసుకున్నప్పటికి నేషనల్ హైవే అదరిటీ వారు నిర్లక్ష్యంగా ఉన్నారని లేఖలో పేర్కునడం జరిగింది. జిరాయి భూమిని పోరంబోకు భూమిగా సర్వే అధికారులు తప్పుడు జాబితా తయారు చేయడం తో బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.ఆర్&బి రోడ్ సమీపంలో ఇల్లు,షాప్ నిర్మించిన గిరిజనులకు నష్టపరిహారం చెల్లించాలని,కించుమండ,డుంబ్రి గూడ గ్రామంలో రోడ్ వెడల్పు తగ్గించాలని కోరడం జరిగింది.దానికి సబ్ కలెక్టర్ స్పందిస్తూ నేషనల్ హైవే అదరిటీ వారికి లేఖ రాసి సమస్యలను పరిష్కరిస్తామని, గ్రామసభ నిర్వహిస్తామనిహామీ ఇచ్చారని తెలియ చేశారు.

 

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags:Compensation should be paid to national highway victims

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page