జీన్స్‌ వేసుకుందని కొట్టి చంపేశారు

0 11

ఉత్తరప్రదేశ్ ముచ్చట్లు :

 

ఉత్సాహం ఉరకలేసే పదిహేడేళ్ల అమ్మాయి సరదాగా జీన్స్‌ వేసుకుంది. అది బంధువులకు నచ్చలేదు. అంతే కర్రలు, రాడ్లతో ఆ అమ్మాయిని కొట్టి చంపేశారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో జరిగింది. తండ్రి పంజాబ్‌లో వలస కార్మికుడుగా పనిచేస్తున్నాడు. అత్తవారి కుటుంబంతో కలిసి ఉండటానికి తల్లి ఇటీవలే తన కూతురుతో కలిసి వచ్చింది. అప్పటి నుంచీ వీరి వస్త్రధారణ, ఆహారంపై ఆ కుటుంబంలోని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సోమవారం ఆ అమ్మాయి జీన్స్‌, టీషర్ట్‌ ధరించింది. తాత, ఇతర బంధువులు వద్దని చెప్పినా వినలేదు. అది సహించలేని ఆ పెద్దలు కర్రలతో తీవ్రంగా కొట్టడంతో ఆ అమ్మాయి స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళదామనుకున్నారు. కానీ, దారిలోనే ఆ అమ్మాయి మరణించడంతో మృతదేహాన్ని నదిలో తోసేయాలనుకున్నారు. వంతెనకు చిక్కుకుని మృతదేహం వేళ్లాడుతు ఉండడంతో విషయం పోలీసులకు చేరింది. తాతను ఇప్పటికే అరెస్ట్‌ చేయగా, పరారీలో ఉన్న మిగిలిన బంధువుల కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

Tags: He was beaten to death for wearing jeans

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page