టీడీపీ నిరసన

0 3

విశాఖపట్నం ముచ్చట్లు:

 

నిత్యవసర సరుకులు,  వంట గ్యాస్ ధరలు పెరగుదల ను నిరసిస్తూ విశాఖ టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద మహిళా విబాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జగన్ రెడ్డి పాలన నశించాలి, ధరలు తగ్గించాలి అంటూ నినాదాలు చేశారు. కర్రల పొయ్యి పై వంట చేసి నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం టీడీపీ పార్లమెంటు విబాగం మహిళా అద్యక్షురాలు సర్వసిద్ది అనంత లక్ష్మీ మాట్లాడుతూ  ధరల దరువు, బ్రతుకు బరువు లా వుందని ఆవేదన వ్యక్తం చేశారు . గ్యాస్ ధర 920/- , నూనె ధర రెండు వందలు నిత్యవసర సరుకులు అన్ని ఆకాశాన్నంటుతుంటే  ఎలా బ్రతకాలి అని ప్రశ్నించారు.  బ్రతకాలంటే భయం వేస్తోంది. సంవత్సరం కి పదిహేను వేలు ఇచ్చి, పేద ప్రజలు పై ధరల బారం మోపుతున్నారని విమర్శించారు.నిత్యవసర  ధరలు నియంత్రణ చేయాలని డిమాండ్ చేశారు .  తక్షణమే ధరలు నియంత్రణ చేయకపోతే టీడీపీ మహిళా విబాగం ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున నిరసన చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: TDP protest

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page