థర్డ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

0 7

నవచైతన్య నిరంతర సేవలు  ప్రశంసనీయం…
మున్సిపల్ చైర్మన్ కూసంపుడి మహేష్

ఖమ్మం   ముచ్చట్లు:
రెండు విడతలుగా వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి ప్రలయాన్ని  సృష్టించిందని, థర్డ్ వేవ్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నవచైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ, డిస్ట్రిక్ ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో 124 మంది పారిశుధ్య కార్మికులకు ఎన్.95 మాస్క్ లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఛైర్మన్ కూసంపుడి మహేష్ మాట్లాడుతూ 2 విడతల కరోన కష్టకాలంలో నవ చైతన్య అందించిన సేవలు ప్రశంసనీయం అన్నారు. ప్రజలంతా భయభ్రాంతులకు గురైన సెకండ్ వేవ్ లో సైతం కరోనా బాధితులకు నవచైతన్య అందించిన సేవలు ఆదర్శప్రాయం అన్నారు. ఐసోలేషన్ కేంద్రాలకే కాకుండా హోం ఐసోలెషన్ లో ఉన్న వారికి కూడా పౌష్టికాహారం అందించడంతో పాటు, నిత్యావసర సరుకులు, మాస్కులు అందించి ఈ ప్రాంతంలో మేటిగా సేవలు అందించరన్నారు. కమీషనర్ సుజాత మాట్లాడుతూ నవ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఈ ప్రాంతంలో  మానవత్వంతో అందిస్తున్న సేవలు మరువలేనివని అన్నారు. సేవల తో పాటు వారు ప్రజల్లో కల్పిస్తున్న అవగాహన అమూల్యమైనదన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు గాదె నరసింహారెడ్డి, తోట కిరణ్, డైరెక్టర్ లు బండి శ్రీనివాస రెడ్డి, మాదిరాజు పుల్లారావు, గుడిపుడి సుదీర్, మొరంపుడి జగదీష్, రాగం శ్రీను, సయ్యద్ ముస్తఫా, పాలకొల్లు కార్తీక్, పాలకొల్లు శ్రీనివాసరావు, కోట శివ నాగరాజు, సునీల్, మారయ్య తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags:Be alert to the third wave

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page