దళితులను వెలివేసిన న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలి

0 16

నంద్యాల ముచ్చట్లు:

నందవరం మండలం గురజాల గ్రామములో దళితులను సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సీఎం శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీనివాస్  మాట్లాడుతూ  కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం, నందవరం మండలం గురజాల గ్రామంలో దళితుడైన ఫిజియోథెరపిస్ట్  బుడ్డన్న ను అదే గ్రామానికి చెందిన అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నాడు అనే కసితో 2020 డిసెంబర్ 31న ఆదోని లో పట్టపగలు అతి కిరాతకంగా చంపారు. ఆ నెత్తుటి మరకలు ఆరకముందే బుడ్డన్న కుటుంబానికి  అధికారులు చేస్తున్న న్యాయాన్ని చూసి ఓర్వలేక కరుడుగట్టిన కుల ఉన్మాదంతో ఆధిపత్య వర్గాలన్నీ ఏకమై, దళితులను అనేక రకాలుగా అవమానిస్తూ వచ్చారన్నారు. దళితవీధినుండిబహిర్భూమికోసమనిబయటకువెళ్లేయువకులను తమ వీధుల గుండా తిరగ రాదంటూ అడ్డుకోవడంతో పాటు, అన్నం తిని ప్లేట్లను కడిగిన నీళ్లను ఇంట్లో నుండే దారిన పోతున్న దళితులపై కి చల్లి అవమానించడం దుర్మార్గమైన చర్య అని వారన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న పెత్తందారీ వర్గాలు,చర్చి కి సంబంధించి దాని ముందు భాగంలో మూడు అడుగులు ముందుకు వచ్చి ప్రహరీగోడ నిర్మిస్తున్నారని దాన్ని అడ్డగించడంతో పాటు, ప్రహరీ గోడ నిర్మాణం దగ్గరికి వచ్చిన దళితులను కులం పేరుతో దూషిస్తూ అడ్డుకున్నారు. మేము చెప్పినట్లు వినాలి లేకపోతే దాడులు చేస్తామని  దౌర్జన్యం దౌర్భాగ్యమైన విషయమని ఆయన అన్నారు. దానిపై ఆందోళన నిర్వహించి కేసు పెట్టాలనిదళితులుపట్టుపట్టడంతో,  అవమానంగా భావించిన పెత్తందారి వర్గాలన్నీ ఒక్కటై దళితులను ఎవరు పనులకు పిలవరాదు, సహకరించ రాదు అతిక్రమిస్తే 5 వేల రూపాయలు జరిమానా అంటూ దళితులనువెలివేశారు.అదేవిదంగా  శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం పరిసర ప్రాంతంలో క్రికెట్ ఆడుతున్న దళిత యువకులను ఆపి మీరు ఇక్కడ ఆడరాదు అంటూ వెనక్కి పంపారు. దళిత మహిళలను పనులకు పిలిచి పొలం దగ్గరకు వెళ్లి పని లో దిగిన తర్వాత ఆపి అవమానించి మరీ పంపారు. దళిత రైతుకు సంబంధించిన పంట వడ్ల కాట పట్టకుండా వర్షం లో నాని నష్టపోయేలా చేశారు. ఆటోల్లో ఎక్కనివ్వలేదు, తుంగభద్ర ఏటిలో  బట్టలు ఉతుక రాదంటూ.. ఇలా దళితులను అడుగడుగునా అవమాన పరుస్తూనే వచ్చారు.
దళితులు అడుగడుగునా అవమానాలను భరిస్తూ.. వివక్ష కారణంగా పనులు లేక ఆకలితో ఎవరు ఎప్పుడు చస్తారో అనే భయంతోబిక్కుబిక్కుమంటూబతుకీడుస్తున్న గురుజాల దళితులకు మానవత్వం కలిగిన ప్రతి మనిషి అండగా నిలబడదాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్న కుల వివక్షత అంటరానితనం తో దళితులపై దాడులు చేస్తూనే ఉన్నారు అన్నారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా దైవం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కచ్చితంగా అమలు చేస్తూ, దళిత గిరిజనులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దళితులను వెలివేసి,అవమానించిన అందరినీ అరెస్టు చేయాలని  లేని పక్షములో రాష్ట్ర వ్యాపితంగా దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యములో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

Tags:The SC ST Atrocities Act should be registered against them on the expulsion of Dalits

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page