దివ్యాంగులకు కౌన్సిలర్ , కార్పోరేటర్లు గా అవకాశం కల్పించాలి మంత్రి అనిల్ కు దివ్యాంగుల వినతి

0 10

నెల్లూరు  ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు కౌన్సిలర్ మరియు కార్పొరేటర్ గా రాజకీయ అవకాశం కల్పించాలని జలవనరుల శాఖ మాత్యులు అనిల్ కుమార్ యాదవ్ కు వైకాపా జిల్లా పార్లమెంటరీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి, దివ్యాంగులు ఆవుల నాగేంద్ర శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. స్థానిక మంత్రి నివాసంలో వారు ఆయనతో మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రంలో అక్కడి మున్సిపాలిటీ చట్టాన్ని సవరణ చేసి, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ లో  మరియు మున్సిపాలిటీలలో దివ్యాంగులకు కౌన్సిలర్ మరియు కార్పోరేటర్లు గా రాజకీయ అవకాశం కల్పించేందుకు ప్రత్యేక జీవో తీసుకురావడం జరిగిందని సంబంధిత జీవోను మంత్రి అనిల్ కు చూపించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని దివ్యాంగులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ లోనూ మరియు మున్సిపాలిటీలలో కౌన్సిలర్లు మరియు కార్పొరేటర్లు గా రాజకీయ అవకాశం కల్పించేందుకు చట్టబద్ధత తీసుకురావాలని కోరారు. ఈ విషయమై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో జిల్లా వాసిగా, మంత్రివర్యులు గా ఆంధ్ర ప్రదేశ్ దివ్యాంగుల తరఫున తమ సహకారం అందించాలని మంత్రి అనిల్ కుమార్ ను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు అంకయ్య, కృష్ణ కిషోర్, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

 

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

- Advertisement -

Tags:Divyangs should be given the opportunity to become councilors and corporators
Divyangula’s request to Minister Anil

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page