దిశ యాప్ పై అవగాహన సదస్సు

0 12

తుని  ముచ్చట్లు:
తుని పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక క్షత్రియ కళ్యాణ మండపము నందు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ ఏలూరు బాలు సుధారాణి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దిశా ఆప్ అనేది మహిళకు ఒక చక్కని వరం లాంటిదని మహిళలు రోడ్డు పైకి వెళ్లాలంటేనే భయం భయంగా ఉందని ఇప్పుడు దిశ యాప్ ద్వారా అలాంటి భయాలు ఏమీ ఉండవని కాలేజీలో రద్దీ ప్రాంతాల్లో బస్టాండ్ లో ఇలా ఏ ప్రాంతంలోనైనా గుర్తుతెలియని వ్యక్తులు మనల్ని వెంబడిస్తే దిశ యాప్ ద్వారా చాకచక్యంగా నిమిషాల్లో పట్టించవచ్చు అని అందుకే ప్రతి ఒక్కరూ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనల్ని మనము రక్షించుకోవచ్చు అని చెప్పారు మన సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళ ఆత్మ రక్షణ కోసం పాటుపడే వ్యక్తి గా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు ప్రతి స్త్రీ ని అక్కచెల్లెలుగా గుర్తించి దిశ యాప్ రూపొందించి మహిళా రక్షణ కోసం ఒక విధమైన చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు తుని పట్టణ ఎస్ ఐ లు స్వామి నాయుడు శ్రీనివాస్ వైయస్సార్ సిపి నాయకులు అని శెట్టి సూర్య చక్ర రెడ్డి పామర్తి మహేష్ షేక్ కాజా కుసుమంచి సుబ్బరాయుడు రేలంగి రమణ గౌడ్ వైయస్సార్ సిపి నాయకులు వార్డు కౌన్సిలర్ లు  తదితరులు పాల్గొన్నారు .

 

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

- Advertisement -

Tags:Awareness seminar on Direction App

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page