నంద్యాలలో ప్రధాన సెంటర్లలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి మాట ఇచ్చి మరచి పోయిన యమ్ యల్ ఏ .శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి          

0 9

నంద్యాల  ముచ్చట్లు:

- Advertisement -

స్థానిక నంద్యాల పట్టణంలో ఏర్పాటు  చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి రామచంద్రుడు,జిల్లా సహాయ కార్యదర్శి షేక్.రియాజ్,రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేసు జిల్లా అధ్యక్షుడు పూల వెంకట్,బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షుడు పెరుగు శివ కృష్ణ యాదవ్,బీసీ సంఘము,కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపంగి రామకృష్ణ, వడ్డే సంఘము జిల్లా నాయకులు చల్ల మద్దిలేటి,విద్యార్థి సంఘాల నాయకుడు పాలుట్ల రమణ  మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రధాన సెంటర్లో ఏర్పాటుకై అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి. లేకపోతే మేము అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని ఆయన అన్నారు. గతంలో 48 గంటలు దీక్ష చేపట్టడం జరిగిందని. ఎన్నోసార్లు అధికారులకు,మరియు ఎమ్మెల్యే కు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి  ఖచ్చితంగా అంబేద్కర్ గారి విగ్రహం ప్రధాన సెంటర్లలో ఏర్పాటు చేస్తామని అప్పట్లో  హామీ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. కానీ  ఇంత వరకు కనీసం చొరవ కూడా చూపించడం లేదన్నారు ,ఇప్పటికైనా అధికారులు,ప్రజాప్రతినిధులు మౌనం విడకపోతే ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ ,ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి దశల వారి ఉద్యమలకు సిద్ధం అవుతామని వారు ప్రభుత్వనికి హెచ్చరిక తెలియజేసారు.ఈ కార్యక్రమంలో, మైనారిటీ నాయకుడు మాబాష ,రాజు,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

Tags:A statue of Dr. Babasaheb Ambedkar should be erected at the main centers in Nandyal
Yam Yal A. Shilpa Ravi Chandra Kishore Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page