నాగరం గ్రామ హమాలి సంఘం అధ్యక్షులుగా మెరుగు రాజన్న

0 9

జగిత్యాల ముచ్చట్లు:

ధర్మపురి మండలంలోని నాగరం గ్రామ హమాలి సంఘం అధ్యక్షులుగా మెరుగు రాజన్న ను నియమిస్తూ ఆ సంఘం జిల్లా అధ్యక్షులు సంబు కొమురయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. జగిత్యాల జిల్లా లోని హమాలి సంఘాల మండల, గ్రామ  కార్యవర్గాల విస్తరణలో భాగంగా ధర్మపురి మండలంలోని నాగరం గ్రామ కార్యవర్గాన్ని నియమించామని జగిత్యాల ప్రెస్ క్లబ్ లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ధర్మపురి మండలంలోని నాగారం గ్రామ అధ్యక్షులుగా మెరుగు రాజన్న, ప్రధాన కార్యదర్శిగా ఎడ్ల అశోక్, ఉపాధ్యక్షులుగా అక్కం పోచయ్య, కోశాధికారిగా చింతల మహేష్, కార్యవర్గ సభ్యులుగా సత్తన్న, సతీష్, అశోక్, లింగన్న, రాజేందర్, సాంబన్న, భూమన్న, కొమురయ్య లను నియమించారు. అలాగే ఈ సందర్భంగా 30 మంది కొత్తగా సభ్యత్వాన్ని తీసుకొన్నారు.ఈకార్యక్రమంలో ధర్మపురి మండల హమాలి సంఘం అధ్యక్షులు రేణు మొండయ్య పాల్గొన్నారు.

 

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags:Merugu Rajanna as the President of Nagaram Grama Hamali Sangham

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page