నీట మునిగిన పంటపోలాలు

0 19

ఆచంట ముచ్చట్లు:

గత రెండు  రోజులుగా భారీగా కురుస్తున్న  వర్షాలకు  అన్నదాతలు అపార నష్టాన్ని చవిచూస్తున్నారు. వేలాది ఎకరాల్లో వేసిన తొలకరి నారుమడులు పూర్తిగా నీట మునిగాయి. పొలాలు  ముంపు   నీటి బారిన పడడంతో పరిస్థితి దారుణంగా మారింది. కొద్దిపాటి వర్షానికే మేజర్, మైనర్ డ్రెయిన్లలో నీటి ప్రవాహం ఎక్కడికక్కడే స్తంభించిపోవడంతో చాలా గ్రామాల్లో    ముంపు ముప్పు తీవ్రమైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర, పోడూరు,ఆచంట ,పెనుగొండ మండలాల్లో  వివిధ ప్రాంతాల రైతులు నారుమడులు సిద్ధం చేసుకున్నారు. కొన్ని చోట్ల నారుమడులు ఏపుగా పెరిగినప్పటికీ మరికొన్ని చోట్ల మొలక దశలో ఉన్నాయి.ఆచంట   సుమారు 680 ఎకరాల్లో  వరి సాగవుతోంది. ఇందుకోసం రైతులు 150  ఎకరాల్లో  నారుమడులను సిద్ధం చేయవలసి ఉండగా ఇప్పటివరకు 120 ఎకరాల్లో  నారుమడు లు వేశారు. వాస్తవానికి జూలై నెలాఖరు నాటికి ఖరీఫ్ నాట్లు పూర్తి కావలసి ఉంది. జూన్ 15న కాల్వ లకు నీటిని విడుదల చేయడం, వాతావరణ పరి స్థితులు సానుకూలంగా లేకపోవడంతో రైతులు నారుమడులు వేయడంలో జాప్యం జరిగింది.జూన్ నెలాఖరు నుంచి ఎక్కడికక్కడే నారుమడులను సిద్ధం చేసుకుంటున్న తరుణంలో గత రెండు  రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాని కారణంగా వేసిన 120 ఎకరాల  నారుమడులన్నీ పూర్తిగా నాశనమవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.  ప్రభుత్వం స్పందించి తమని అన్నివిధాలా ఆదుకోవాలని కోరుతున్నారు.

 

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: Submerged crops

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page