పుంగనూరులో క్లీన్‌ ఆంధప్రదేశ్‌లో భాగస్వామ్యులుకండి – కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 14

పుంగనూరు ముచ్చట్లు:

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన క్లీన్‌ ఆంధప్రదేశ్‌లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులుకావాలని కమిషనర్‌ కెఎల్‌.వర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, చైర్మన్‌ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో ( క్లాప్‌) క్లీన్‌ ఆందప్రదేశ్‌ అవగాహన సదస్సు నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన క్లాప్‌ కార్యక్రమంపై పట్టణంలోని 31 వార్డుల్లోను మహిళా సంఘాలను భాగస్వామ్యులను చేసి అవగాహన కల్పిస్తున్నామన్నారు. తడిచెత్త, పొడి చెత్త, హానికార చెత్తను వేరుచేసి, వాటిని శాయ పద్దతిలో నశింపచేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. పట్టణంలో అన్ని ఖాళీ స్థలాల్లోను, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విరివిగా చేపట్టి, వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో క్లీన్‌ ఆందప్రదేశ్‌లో పుంగనూరు ప్రథమస్థానంలో నిలిచేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ గంగయ్య,సీఐ గంగిరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: Participate in Clean Andhra Pradesh in Punganur – Commissioner KL Verma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page