పుంగనూరులో భూకంపం

0 612

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రజలు నిద్రమత్తు నుంచి తేరుకుంటుండగా ఒక్కసారిగా భూమి కంపించి , భయంకరమైన శబ్దాలు రావడంతో ప్రజలు పరుగులుతీసిన సంఘటన పుంగనూరు మండలం ఈడిగపల్లె, కోటగడ్డ, బోడేవారిపల్లె,చిలకావారిపల్లె, కురవచీరు, షీకారిపాళ్యెం గ్రామాల్లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఉదయం 5 గంటల ప్రాంతంలో భూమి రెండు సార్లు కంపించింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. ఈ సంఘటన జరిగిన కొద్ది నిమిషాల వ్యవధిలోని భూమి మరోసారి కంపించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురైయ్యారు. ఈ ప్రకంపణలతో ఇండ్లలోని చిన్నచిన్న వస్తువులు కదిలి నేలపై పడ్డాయి. భూకంపంతో ఎలాంటి ప్రమాదము, నష్టము సంభవించలేదు. విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ , తహశీల్ధార్‌ వెంకట్రాయులుకు ఫోన్‌ చేసి గ్రామాలను సందర్శించి, నివేదికలు పంపాలని ఆదేశించారు. కాగా గతంలో కూడ పుంగనూరు, ఈడిగపల్లె ప్రాంతాల్లో భూమి కంపించింది.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

Tags: Earthquake in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page