పుంగనూరు నుంచి ఆర్మీకి ఎంపికైన వారికి శిక్షణకు తరలింపు

0 47

పుంగనూరు ముచ్చట్లు:

 

నియోజకవర్గంలోని నిరుద్యోగులను ఆర్మీలో నియమించేందుకు ఎంపిక చేసిన నిరుద్యోగులను శిక్షణ నిమిత్తం శుక్రవారం తిరుపతికి పంపారు. మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్సుల్లో నిరుద్యోగులను డిఫెన్స్అకాడమికి తరలించారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి కలసి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన నిరుద్యోగులను ఆర్మీలో నియమించేందుకు సుమారు 500 మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. వీరికి తిరుపతిలో నెల రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి, దేశ భద్రతకు పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, ఇన్‌చార్జ్ ఎంపీడీవో రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

Tags: Transfer from Punganur to Army recruits for training

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page