ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు కూతురు గొంతుకోశాడు

0 19

జార్ఖండ్‌ ముచ్చట్లు :

జార్ఖండ్‌లో కుల దురహంకార హత్య కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో కన్నకూతురినే హతమార్చిన అమానుష ఘటన మానవత్వాన్ని మంట గలిపింది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు రాంప్రసాద్ కుమార్తె ఖుష్‌బూ కుమారి (20) తొమ్మిది నెలల క్రితం, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లిని అంగీరించలేని తండ్రి ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా తమ ల్యాండ్‌ను చూపిస్తాను రమ్మని కూతురిని నమ్మించాడు. అప్పటికే ఏడు నెలల గర్భవతి అయిన ఖుష్బూ తండ్రితో పాటు తల్లి కూడా ఉండటంతో పూర్తిగా నమ్మి వారితో బయలు దేరింది. రాంప్రసాద్‌ అక్కడ అదను చూసి పదునైన ఆయుధంతో కూతురి గొంతు కోశాడు. తల్లి పెద్దగా అరవడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

Tags:The daughter lamented that Prema was getting married

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page