ప్రేయసి మరణాన్ని తట్టుకోలేక ప్రియుడు ఆత్యహత్య

0 20

గాజువాక ముచ్చట్లు :

 

ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గాజువాకలో చోటుచేసుకుంది. అనకాపల్లికి చెందిన అమ్మాయి, గాజువాక దేశపాత్రునిపాలేనికి చెందిన దట్టి రోహిత్‌ కుమార్‌ (25) ప్రేమించుకున్నారు. రోహిత్‌కుమార్‌ గాజువాకలో ఒక హోటల్‌లో పనిచేస్తున్నాడు. ఇటీవల అతడు ప్రేమించిన అమ్మాయి కరోనాతో గుంటూరులోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. అప్పటినుంచి అతడు ముభావంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అతను తన గదిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: Boyfriend commits suicide over girlfriend’s death

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page