బ్రతికుండగానే సొమ్ములు స్వాహా

0 11

రంగారెడ్డి      ముచ్చట్లు:
బ్రతికుండగానే రైతు బీమా స్వాహా చేశాడు ఓ ప్రబుద్ధుడు రైతు బందు కో ఆర్డినేటర్ మాయాజాలం కురిపించాడు. నకిలీ సర్టిఫికెట్ లు నకిలీ పత్రాలు సృష్టించాడు. మీ ఖాతాలో మా ధన్యం డబ్బులు పడ్డాయని డ్రా చేసుకున్నాడు. రైతు బంధు రాకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.వికారాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుల్కచర్ల మండలం పుట్టావహాడ్ గ్రామంలో ఈ మోసం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన రాఘవెందర్ రెడ్డి అదే గ్రామలో రైతు బందు కో ఆర్డినేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.అయితే డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధ మహిళ ఎనుగొండ చంద్రమ్మ (58) మోసం చేసి అడ్డుపెట్టుకుని డబ్బులు సంపాదించాలను కున్నాడు. ఎనుగొండ చెంద్రమ్మకు చెందిన రైతు భీమా కాజేయాలని ప్లాన్ వేశాడు. సెప్టెంబర్ 14 2020న చనిపోయిందని అదేనెల 30న నకిలీ సర్టిఫికేట్ లు పత్రాలు సృష్టించి వ్యవసాయ అధికారులకు మభ్యపెట్టి రైతు బందు ప్రక్రియ పూర్తి చేశాడు.చంద్రమ్ము కుమారుడు బాలయ్యకు మాయ మాటలు చెప్పి ఐదు లక్షలు కాజేశాడు. తన తల్లి రైతు బంధు పడలేదని వ్యవసాయ అధికారులను ఆశ్రయించాడు. కొడుకు బాలయ్య మీ అమ్మ చనిపోయింది అందుకుగాను ఐదు లక్షల రైతు భీమా నగదు అకౌంట్లో పడిందన్నారు. అందుకే రైతు బంధు రాలేదని చెప్పారు. దీంతో ఈ మాట విన్న చంద్రమ్మ కుమారుడు బాలయ్య షాక్ అయ్యాడు. మా అమ్మ బ్రతికుండగానే చనిపోయిందనడమేంటి అధికారులను నిలదీశాడు .ఈ విషయమై కుల్కచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాలయ్య. ఈ మోసంలో అధికారుల పాత్ర ఎంత ఉందన్న విషయం తెలియాల్సి ఉంది. అధికారుల హస్తం లేకుంటే ఇంత పెద్ద మోసం ఎలా జరుగుతుందని పలువురు గ్రామస్తులు విమర్శిస్తున్నారు.

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

- Advertisement -

Tags:Money swaha while alive

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page