భారీ వర్షానికి నీట మునిగిన పంట పొలాలు.

0 6

– ప్రాజెక్టు అధికారి నిర్లక్ష్యం వల్ల గ్రామాలకు ముప్పు

పెద్దపల్లి  ముచ్చట్లు:

- Advertisement -

మూడు రోజుల నుంచి నిర్విరామంగా కురుస్తున్న వర్షాల వల్ల రామగిరి మండలం ముస్ట్యాల గ్రామంలోని 350 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి, దిగువన ఉన్న సుందిళ్ల బ్యారేజీ వదలడంతో ముస్ట్యాల గ్రామంలోని పంట పొలాలు నీట మునిగాయి. ఇదే వరద కొనసాగడంతో గ్రామంలోకి వచ్చే అవకాశం ఉంది. భయంతో గ్రామస్తులు ఉన్నారు. వరద వృద్ధి ఎక్కువగానే ఉంది. ముందస్తుగా గ్రామాల్లో ప్రాజెక్టు అధికారులు ఎలాంటి హెచ్చరికలు గాని ప్రజలను అప్రమత్తం చేయడం గానీ చేయలేదు దీనికి పూర్తి బాధ్యత అధికారుల నిర్లక్ష్యమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీట మునిగిన పంట పొలాల రైతులను  ప్రజలను అప్రమత్తం చేస్తూ మహిళ సర్పంచ్ రామగిరి లావణ్య సహాయక చర్యలు  చేపట్టారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలకు రైతులకు అండగా ఉంటున్నారు.

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: Crop fields submerged by heavy rains.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page