భారీ వర్షాలతో రాకపోకలకు అంతరాయం

0 23

ఖమ్మంముచ్చట్లు:

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో  గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో  వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి  కొణిజర్ల మండలం తీగలబంజార అంజనా పురం గ్రామాల వద్ద నిమ్మవాగు పగిడేరు వాగులు పొంగి ప్రవహిం చటంతో  పల్లిపాడు నుంచి ఏన్కూరు  వెళ్లే రహదారి రాకపోకలు బంద్ అయ్యాయి  నియోజకవర్గ కేంద్రంలోని వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం18.3  అడుగులు దాటి 19.6 అడుగులకు వరద నీరు చేరటంతో రిజర్వాయర్ నాలుగు అలుగులపై భారీ స్థాయిలో వరద నీరు ప్రవహి స్తుండటంతో లోతట్టు ప్రాంతాలైన  స్నానాల లక్ష్మీపురం గ్రామం వద్ద  బ్రిడ్జి పై వరదనీరు పొంగటంతో సిరిపురం  లక్ష్మీపురం ముసలిమడుగు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి  నియోజకవర్గంలోని ఏన్కూరు కొణిజర్ల వైరా తల్లాడ మండలాల్లో చెరువులు కుంటలు నీటితో జలకళను  సంతరించుకున్నాయి  గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామీణ ప్రాంత ప్రజలు  తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

Tags:Interruption to traffic with heavy rains

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page