మంచిర్యాలలో సహాయక చర్యలు

0 23

మంచిర్యాల ముచ్చట్లు:

జలమయమైన  మంచిర్యాల పట్టణ లోతట్టు ప్రాంతాలలో పాలకులు, జిల్లా పోలీసు యంత్రాంగం, మున్సిపాలిటీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.  గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మంచిర్యాల పట్టణ లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధం కి గురి అయ్యాయి. దీంతో అప్రమత్తమైన పాలకులు, పోలీసు యంత్రాంగం, మునిసిపాలిటీ అధికారులు, కార్మికులు వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను రక్షించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలు కురవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో భారీ వరద ప్రవాహం మొదలై ఇండ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు అవస్థలకు గురి కావడం జరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పాలకులు, అధికారులు వారిని రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతుంది. ఇదేగాక పాలకులు, అధికారులు ప్రజలకు సూచనలు, జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది. ఇంకా ప్రమాదం పొంచి ఉన్న కారణంగా, మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ముందుచూపుతో వ్యవహరించాలని పలు జాగ్రత్తలతో కూడిన సూచనలు చేశారు.

 

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags:Supportive measures in Manchirala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page