మహిళలకు రక్షణ కవచంలా దిశ -డిఎస్పీ గంగయ్య

0 39

పుంగనూరు ముచ్చట్లు:

 

 

సమాజంలోని మహిళలందరికి ఆపద సమయంలో దిశ యాప్‌ రక్షణ కవచంలా పనిచేస్తుందని, దీనిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని పలమనేరు డిఎస్పీ గంగయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం కమిషనర్‌ కెఎల్‌.వర్మ, సీఐ గంగిరెడ్డి ఆధ్వర్యంలో దిశయాప్‌పై అవగాహన సదస్సును చైర్మన్‌ అలీమ్‌బాషా, జానపదకళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణంతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలను విడుదల చేశారు. డిఎస్పీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన దిశయాప్‌ను మహిళలు ఫోన్లద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా మహిళలు గట్టిగా ఫోన్‌ను పట్టుకుని ఊపితేచాలు పోలీసులు సిగ్నిల్‌ను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి, నిమిషాల వ్యవధిలో మహిళల వద్దకు చేరుకుని ఆమహిళలను ఆపద నుంచి కాపాడుతామని తెలిపారు. మహిళలు నిర్భయంగా తమకు ఎదురైయ్యే సమస్యలను సంబంధిత పోలీస్‌ అధికారులకు తెలియజేయాలని కోరారు.అలాగే అన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు ఈ విషయమై అవగాహన కల్పించుకుని మహిళలకు రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి పిఏ మునితుకారం, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, మహిళా కౌన్సిలర్లు రేష్మా, లలిత, మమత, సాజిదాబేగం , మాజీ వైస్‌ చైర్మన్‌ ఆవులఅమరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: Direction as a shield for women -DSP Gangaiah

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page