వరద బాధితులకు సహాయం అందించడం అభినందనీయం ఎమ్మెల్యే డాక్టర్. సంజయ్ కుమార్

0 9

జ‌ల‌మ‌య‌మైన కాలనీల‌ను ఎమ్మెల్యే ప‌రిశీలన

జగిత్యాల ముచ్చట్లు:

- Advertisement -

గత రెండు రోజులుగా ఎడాతేరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం అయిందని,లోతట్టు ప్రాంతాలైన బుడ‌గ జంగాల కాల‌నీ లోని వరద బాధితులకు వైద్యలు సహాయం చేయడం అభినందనీయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆన్నారు. శుక్రవారం జ‌గిత్యాల పట్ట‌ణంలోని ప‌లు ప్రాంతాలు భారీ వ‌ర్షం కార‌ణంగా జ‌ల‌మ‌యం అయి నీట మున‌గ‌టంతో ప‌ట్టణంలోని 8వ వార్డు బేడ‌ బుడ‌గ జంగాల కాల‌నీని ఎమ్మెల్యే డా.సంజ‌య్ కుమార్ ప‌రిశీలించారు..పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న వీరి గుడిసెలు వ‌ర్షం కార‌ణంగా పూర్తిగా నీట మునిగి పోయాయ‌ని వరద బాధితులకు సహాయకరంగా ప్ర‌భుత్వం త‌రుపున 50 మంది నిరుపేద‌ల‌కు నిత్య‌వ‌స‌రాలు,అలాగే ప‌ట్ట‌ణానికి చెందిన ప్ర‌ముఖ వైద్యులు డా. రాచ‌కొండ శ్రీనివాస్,డా.నాగ‌ర‌త్న లు వరద బాధితులకు కోసం ముందుకొచ్చి 30 మంది పేద‌ల‌కు నిత్యవ‌స‌రాలు అందజేశారు..ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బేడ బుడ‌గ జంగాల కాల‌నీ వాసులంతా అత్యంత నిరుపేద‌ల‌ని,కూలీ ప‌నిచేసుకుని పూరి గుడిసెల్లో నివాస‌ముంటున్న దళితులందరికి రాష్ట్ర‌ ప్ర‌భుత్వం త‌రుపున‌ నూక‌పెల్లిలో నిర్మిస్తున్న 4520 ఇండ్ల‌లో 700 ఇండ్ల‌ను కేటాయించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వ‌ర్షాల‌కు అధైర్య‌ప‌డ‌కుండా ఉండాల‌ని ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా ఆదుకుంటుంద‌ని హామీ ఇచ్చారు.ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక కౌన్సిలర్ వారణాసి మల్లవ్వ, తిరుమలయ్య,కౌన్సిలర్ కప్పల శ్రీకాంత్,వైద్యులు రాచకొండ శ్రీనివాస్,నాగరత్న,ఎమ్మార్వో వెంకటేష్, డిటి రాజేంద్రప్రసాద్,ఆర్ఐ ఖాజీమ్ అలీ,భాస్కర్,కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

 

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags:Providing assistance to flood victims is appreciated MLA Dr. Sanjay Kumar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page