శ్రీ కపిలేశ్వరాలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

0 7

తిరుమల ముచ్చట్లు:

 

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్ర‌వారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.ఇందులో భాగంగా ఉదయం మూలవర్లకు అభిషేకం, మహాపూర్ణాహుతి, పవిత్ర సమర్పణ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీపనైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం పంచ మూర్తుల‌కు ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు  రెడ్డిశేఖ‌ర్,  శ్రీ‌నివాస నాయ‌క్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: Sacrifice ceremonies ending with Mahapurnahuti at Sri Kapileswara Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page