సిద్ధూ, అమరీందర్ ఛాయ్ పే చర్చా

0 10

ఛండీఘడ్ ముచ్చట్లు:

పంజాబ్ కాంగ్రెస్ లో కొన్ని నెలలుగా సాగిన సంక్షోభం ముగిసినట్టే కనిపించింది. ఉప్పు, నిప్పులా ఉన్న సిద్దు, సీఎం అమరేందర్ సింగ్ కలిసిపోయారు. రాష్ట్ర కాంగ్రెస్ ఛీప్ గా నవజోత్ సింగ్ సిద్దు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం అమరేందర్ తన సహచరులతో బాటు హాజరయ్యారు. పంజాబ్ కాంగ్రెస్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో వీరిద్దరి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మొదట చాయ్ సేవించిన సిద్దు, సింగ్ ఫోటోలకు ఫోజులిచ్చారు. పంజాబ్ భవన్ కు తొలుత సింగ్ రాగానే మాజీ క్రికెటర్ సిద్దు ఆయనకు చేతులు జోడించి సాదరంగా స్వాగతం పలికారు. ప్రమాణ స్వీకారానికి గాను వేదికనెక్కే ముందు ఈయన అలనాటి క్రికెటర్ గా ఫొటోకు పోజునిచ్చి కదిలారు. దాదాపు నాలుగు నెలల తరువాత వీరిద్దరూ సమావేశం కావడం ఇదే మొదటిసారి.ప్రమాణం చేసిన అనంతరం సిద్దు..తనకు సామాన్య పార్టీ కార్యకర్తకు మధ్య భేదమేమీ లేదని, ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు నుంచీ పార్టీ శాఖ అధ్యక్షుడేనని అన్నారు. పార్టీలో అందరినీ కలుపుకుని పోతానన్నారు.ఇక అమరేందర్ సింగ్ ..సిద్దు తోను, పాటియాలా తోను తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సిద్దు పుట్టినప్పుడు తాను ఆర్మీలో ఉన్నానని, తన తల్లి తనను పాలిటిక్స్ లో చేరమని ప్రోత్సహించిందని ఆయన చెప్పారు. ఈ విషయంలో సిద్దు తండ్రి తనకు సాయపడ్డారని, ఇతనికి ఆరేళ్ళ వయస్సు ఉండగా తాను వారి ఇంటికి వెళ్ళేవాడినని ఆయన పేర్కొన్నారు. ఇంత ఆర్భాటంగా సిద్దు ప్రమాణ స్వీకారం జరిగినా ఏదో వెలితి.. అమరేందర్ సింగ్ పంజాబ్ భవన్ కి చేరుకునే ముందు సిద్దు కొద్దిసేపు బయటికి వెళ్లి వచ్చారు. ఇద్దరూ కలుసుకోవడానికి మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. సెరిమనీ సందర్భంలో ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకోలేదు.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

Tags:Sidhu, Amarinder Chai Pay Discussion

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page