హైదరాబాద్ ఎవ్వరూ రావొద్దు ్: కేటీఆర్

0 15

హైదరాబాద్   ముచ్చట్లు:
తన జన్మదిన వేడుకలకు ఎవరూ హైదరాబాద్ రావొద్దని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన, తన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు సూచించారు. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో, సీఎం కేసీఆర్ వారి ఆదేశాల మేరకు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని కేటీఆర్ పార్టీ శ్రేణులను కేటీఆర్ కోరారు. మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని కేటీఆర్ సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన చోట్ల సహాయక చర్యల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని కేటీఆర్ కోరారు. గౌరవ ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులకు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో, పార్టీ శ్రేణులంతా ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడం కంటే సంతోషకరమైంది తనకు ఏమీ ఉండదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో  తాను ఎవరినీ కలవడం లేదని, ఈ విషయంలో అన్యధా భావించవద్దని పార్టీ శ్రేణులను కేటీఆర్ వినమ్రంగా కోరారు.ఇప్పటికే విజ్ఞప్తి చేసిన మేరకు తమకు తోచిన విధంగా ఎవరికి వారు ఇతరులకు సహాయం అందిస్తూ,  మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని కేటీఆర్ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన బర్త్ డే సందర్భంగా వికలాంగులకు ఇవ్వనున్న ద్విచక్రవాహనాల కార్యక్రమాన్ని వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత నిర్వహిస్తారని కేటీఆర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

 

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

- Advertisement -

Tags:Nobody comes to Hyderabad: KTR

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page