అసెంబ్లీ ఆవరణలో ముక్కోటి వృక్షార్చన

0 9

హైదరాబాద్      ముచ్చట్లు:
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి  కేటి రామారావు జన్మధినం సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్వహిస్తున్న “ముక్కోటి వృక్షార్చన” లో భాగంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆవరణలో రాష్ట్ర శాసన సభాపతి  పోచారం శ్రీనివాస రెడ్డి,  శాసనమండలి ప్రొటెం చైర్మన్  వి. భూపాల్ రెడ్డి,  శాసనసభ్యులు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లు ఎంఎస్  ప్రభాకర్ రావు, భానుప్రసాద్ రావు, కూచికుళ్ళ దామోదర్ రెడ్డి, మండలి సభ్యులు వాణీదేవి, బుగ్గారం దయానంద్, ఫారుక్ హుస్సేన్, విజీ గౌడ్, పలువురు మాజీ శాసనమండలి సభ్యులు, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు పాల్గోన్నారు.
ఈసందర్భంగా సభాపతి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ కు జన్మధిన శుభాకాంక్షలు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన త్రాగునీరు, సేంద్రియంగా పండించిన సహజ ఆహారం అవసరం. ఈ మూడు రకాల అవసరాలను ప్రజలకు అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ కృషి చేస్తున్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా 230 కోట్ల మొక్కలు నాటుతున్నారు. మిషన్ భగీరధ పథకం ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందుతుంది. సహజమైన సేంద్రియ ఆహార ధాన్యాలు సాగుచేయడానికి ప్రోత్సహిస్తున్నారు. రాజ్యసభ సభ్యులు జే. సంతోష్ కుమార్  ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం అభినందించదగినది. మొక్కలు నాటడం అనేది ఒక మంచి కార్యక్రమం. మంచి కార్యక్రమానికి రాజకీయ పార్టీలు, పదవులు అడ్డు రావు. ప్రజలు హరితహారం స్పూర్తితో మొక్కలను ఫెద్ద ఎత్తున నాటాలి, రక్షించాలని అన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

- Advertisement -

Tags:Triangular vegetation on the Assembly premises

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page