ఈటలపై అసంతృప్తి ఉందా

0 13

కరీంనగర్  ముచ్చట్లు:

హుజూరాబాద్ ఉప ఎన్నిక అధికార పార్టీకి ఎంత ప్రతిష్టాత్మకమో అదే రీతిలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు కూడా అంతే ముఖ్యం. ఆయన పై నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి నెలకొని ఉంది. ఆరుసార్ల నుంచి వరసగా గెలుస్తుండటంతో సహజంగా వ్యతిరేకత ఉందన్నది బీజేపీ కూడా అంచనా వేస్తుంది. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్న విమర్శలున్నాయి.ఈటల రాజేందర్ అధికార పార్టీలో ఉన్నంత వరకూ ఆయనకు హుజూరాబాద్ ప్రజలు వరసగా పట్టంకట్టారు.

- Advertisement -

అయితే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకు రావడం, బీజేపీలో చేరడం కూడా మైనస్ గా మారిందంటున్నారు. ప్రత్యేకంగా రెడ్డి, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గం ఓటర్లు ఈటల రాజేందర్ కు దూరమయ్యే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. హుజూరాబాద్ కు కొత్త ముఖం కావాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారని సర్వేలు కూడా చెబుతున్నాయి.బీజేపీ పై ఇప్పటికే కొంత అసంతృప్తి ఉంది. పెట్రోలు ధరలు, నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రజలు బీజేపీ పట్ల సానుకూలంగా లేరు. దీనికి తోడు ఈటల రాజేందర్ పై ఉన్న అసంతృప్తి కూడా తోడయితే గెలుపు అవకాశాలు తక్కువేనన్నది బీజేపీ నేతల నుంచి కూడా విన్పిస్తున్న మాట. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఏం చేయాలన్న దానిపై పార్టీ అగ్రనేతలు ఇటీవల జరిపిన సమావేశంలో లోతుగా చర్చించినట్లు తెలిసింది.ఈటల రాజేందర్ ప్రస్తుతం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఆయన పర్యటనలకు అంత స్పందన కూడా రావడం లేదని తెలుస్తోంది. బీజేపీ నేత పెద్దిరెడ్డి సయితం ఈటల రాజేందర్ ను పార్టీలోకి తీసుకు రావడంపై అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఈటల రాజేందర్ అభ్యర్థిత్వంపై బీజేపీ పునరాలోచనలో పడిందంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం కావడంతో ఆయన సతీమణి జమున అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద చివరి నిమిషంలో బీజేపీ అగ్రనాయకత్వం మార్పు నిర్ణయం తీసుకునే అవకాశముంది.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Is there dissatisfaction with yards

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page