కేటీఆర్ కు షర్మిల షాకింగ్ విషెస్

0 18

హైదరాబాద్    ముచ్చట్లు:
తెలంగాణ ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి, సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖుల నుంచి కార్యకర్తలు , సామాన్యుల వరకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పలువురు రాజకీయ నేతలు కూడా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలవైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా కేటీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆమె ట్వీట్ చేశారు. కేసీఆర్ గారి కొడుకు అంటూ.. ఆమె తన మెసేజ్‌ను ప్రారంభించారు.‘ కేసీఆర్  కొడుకు కేటీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో పాటు .. నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపె హృదయాన్ని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేసే పట్టుదలను.. 54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, విద్యార్థులకు పూర్తి ఫీజ్ రిఎంబర్స్మెంట్ ఇచ్చె మనసుని..ఇవ్వాలని కోరుకొంటున్నాను. మీ భాద్యతను గుర్తుచేసె చిన్న విడియో కానుక‘ అంటూ ఓవీడియోను కూడా ఆమె ట్వీట్‌కు జత చేసి పోస్టు చేశారు.అయితే షర్మిల చేసిన ట్వీట్ పై కేటీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. షర్మిలకు ట్వీట్‌కు స్ట్రాంగ్‌గా రిప్లై ఇస్తున్నారు. ఓ నెజిటన్ కేటీఆర్ ఎవరో తెలియదన్నావు కదా అంటూ మెసేజ్ పోస్టు చేశారు. మరికొందరు మీ విషెస్ అవసరం లేదంటూ మండిపడ్డారు. ఇంకొందరు.. తెలంగాణలో మీ రాజకీయాలు చెల్లవంటూ షర్మిలకు ట్వీట్స్ ద్వారాా ఘాటైన సమాధానం ఇస్తున్నారు.

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

- Advertisement -

Tags:Sharmila’s shocking wishes to KTR

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page