చెరకు రైతుల అందోళన

0 9

రేణిగుంట  ముచ్చట్లు:
చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల, తమిళనాడు తిరువల్లూరు జిల్లా, చెరకు రైతులకు 50 కోట్లు చెల్లించ కుండా మోసం చేసిన మయూర షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం జయరాం చౌదరిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా రేణిగుంట హైవే రోడ్డుపై రైతు సంఘం నేతలునిరసన తెలిపారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హేమలత, రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షులు మాంగాటి గోపాల్ రెడ్డి, ఆర్.పి.ఐ నాయకులు అంజయ్య, జనసేన నాయకులు రాజా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నారాయణ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్ధన్, పాత చెక్ పోస్ట్ వరకు ర్యాలీగా వచ్చిన రైతులు అక్కడే రోడ్డుపై బైఠాయిం చడంతో గంటసేపు రోడ్డు దిగ్బంధం జరిగింది. దీంతో రేణిగుంట సీఐ అంజు యాదవ్, పోలీసులు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హేమలత ను,  అఖిలపక్షం నేతలను, రైతు సంఘం నాయకులను  అరెస్టు చేసి రేణిగుంట పోలీస్ స్టేషన్ కు తరలించా రు.ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హేమలత మాట్లాడు తూ  గత రెండు సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసాము. అయినా ఎవరు పట్టించు కోలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని సమస్య పరిష్కారం చేయాలని కోరారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

- Advertisement -

Tags:Concern of sugarcane farmers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page